వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.100 నోటు విడుదల చేసేందుకు ఆర్‌బిఐ సన్నాహలు

కొత్త రూ.100 నోటును మార్కెట్లోకి విడుదల చేయాలని ఆర్‌బిఐ భావిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త వంద రూపాయా నోటును ఆర్‌బిఐ ప్రింట్ చేస్తోందని సమాచారం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త రూ.100 నోటును మార్కెట్లోకి విడుదల చేయాలని ఆర్‌బిఐ భావిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త వంద రూపాయా నోటును ఆర్‌బిఐ ప్రింట్ చేస్తోందని సమాచారం.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్‌బిఐ కొత్త కొత్త నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. కొత్త డినామినేషన్‌ నోట్లనే కాకుండా ప్రస్తుతమున్న వాటికి కొత్త నోట్లను తీసుకొస్తోంది.

New Rs 100 notes coming next year, printing to begin in April

తాజాగా100 రూపాయి కరెన్సీ నోట్లు కొత్తవి మార్కెట్‌లోకి ఆర్‌బిఐ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.. 2018 ఏప్రిల్‌ నుంచి ఈ నోట్ల ప్రింటింగ్‌ను ప్రారంభించాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్టు ఆర్‌బిఐ వర్గాలు చెప్పాయి.

రూ.200 డినామినేషన్‌ నోట్ల ప్రింటింగ్‌ పూరైన తర్వాత వెంటనే ఈ కొత్త రూ.100 నోట్ల ప్రింటింగ్‌ను మొదలుపెట్టాలని ఆర్బీఐ చూస్తుందని తెలిపాయి. కొత్త రూ.200 నోట్లు పూర్తిగా సిస్టమ్‌లోకి రావాలంటే కనీసం ఆరు నెలలైనా సమయం పడుతుందని సమాచారం.

కొత్త సెక్యురిటీలో ఈ నోట్లను ముద్రిస్తున్నారని సమాచారం. ప్రస్తుతమున్న రూ.100 డినామినేషన్‌ నోట్లు సిస్టమ్‌లో ఉంటాయని, కానీ మెల్లమెల్లగా వాటిని వెనక్కి
తీసుకొనే ఆలోచనలో ఆర్‌బిఐ ఉందని ప్రచారం సాగుతోంది.

కొత్త రూ.100 నోట్ల సైజులో ఎలాంటి మార్పులు ఉండబోవట. ఏటీఎంలలో సరిపోయే విధంగానే వీటిని తయారుచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చిల్లర కొరతకు అడ్డుకట్ట వేయడానికి చిన్న డినామినేషన్‌ నోట్ల విడుదలపై ఆర్బీఐ ఎక్కువగా దృష్టిసారించింది.

English summary
RBI is expected to start printing redesigned Rs 100 currency notes around April next year, sources in the central bank have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X