వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొమ్మ పడుద్ది..? 15 నుంచి థియేటర్లు ఓపెన్, మల్టీప్లెక్స్ కూడా.. గైడ్ లైన్స్ ఇవే..

|
Google Oneindia TeluguNews

వైరస్ విజృంభణతో సినిమా హాల్స్ మూతపడిపోయాయి. గత 7 నెలల నుంచి క్లోజ్ చేసి ఉన్నాయి. అయితే అన్ లాక్ 5.0లో భాగంగా సినిమా హాల్స్ తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నాన్ కంటైన్మైంట్ జోన్లలో గల సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

50 శాతం సీట్ల సామర్థ్యంతో..

50 శాతం సీట్ల సామర్థ్యంతో..

ఈ నెల 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లలో బొమ్మ పడనుంది. అయితే 50 శాతం సీట్ల సామర్థ్యంతో మాత్రమే ఓపెన్ చేయాలి. సీట్ల మధ్య తప్పనిసరి దూరం ఉండాలని తేల్చిచెప్పింది. అంతేకాదు కరోనా వైరస్‌పై అవగాన కల్పించేలా అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వాలని కూడా తెలిపారు. ఇక హాళ్లలో భౌతిక దూరం తప్పనిసరి అని.. చేతులను శానిటైజ్ చేసుకోవాలని పేర్కొన్నది. లోపలికి వెళ్లే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని తేల్చిచెప్పింది.

విధిగా శానిటైజర్లు..

విధిగా శానిటైజర్లు..

అంతేకాదు చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు ఉండాలని పేర్కొన్నది. 50 శాతం మంది క్రమంగా వెళ్లి శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. థియేటర్లలో విధిగా శానిటైజర్లను ఉంచాలని స్పష్టంచేసింది. అయితే మల్టిప్లెక్స్‌లలో కూడా సింగిల్ స్క్రీన్ మాత్రమే పనిచేయాలని కేంద్రమత్రి ప్రకాశ్ జవదేకర్ థియేటర్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

ప్యాక్ చేసిన ఆహారం..

ప్యాక్ చేసిన ఆహారం..

అలాగే ఆరోగ్య సేతు యాప్ వాడాలని నోటీసు పెట్టాలని కూడా సూచించారు. థియేటర్ ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషేధించారు. ఫుడ్ కౌంటర్లలో ప్యాక్ చేయబడిన ఆహారం మరియు పానీయాలు మాత్రమే అనుమతిస్తారు. సినిమా హాల్ లోపల స్నాక్స్ పంపిణీకి పర్మిషన్ లేదు. థియేటర్ సిబ్బందికి తప్పనిసరిగా పీపీఈ కిట్లను అందించాలని సినిమా థియేటర్ యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Recommended Video

Opening Of Theatres Will Be Decided After Reviewing Covid-19 Status In June

English summary
cinema thetres will be open in october 15th central government said. but masks are compulsory, 50 seating capacity will only allowed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X