వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 1 తారీఖు:డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలకు కొత్త రూల్స్, పెట్రోల్ పంపుల షాక్, ఎస్బీఐ గుడ్‌న్యూస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అక్టోబర్ 1 నుంచి మన రోజువారీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ కొత్త నిబంధనలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్స్)కు సంబంధించి పలు మార్పులను చేసింది.

ఈ నేపథ్యంలో మీరు డ్రైవింగ్ లైసెన్సులను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక, అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా లభించే డిస్కౌంట్లు ఇక ఉండవు. ఇక పెద్ద వ్యాపారాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ టాక్సుల తగ్గింపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీల కొత్త రూల్స్

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీల కొత్త రూల్స్

అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయబడతాయి. కొత్తగా జారీ చేయబడి డ్రైవింగ్ లైసెన్సులు మైక్రోచిప్ కలిగి ఉంటాయి. క్విక్ రెస్పాన్స్(క్యూఆర్) కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) ఫీచర్లను కూడా ఉంటుంది.

ఈ విధంగా సెంట్రలైజ్ చేసిన డేటా పదేళ్ల వరకు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తులకు పెనాల్టీలు వేయడం, రికార్డులను నిర్వహించడం ప్రభుత్వానికి సులభమవుతుంది. వివిధ రకాల దివ్యాంగ డ్రైవర్లు, వాహనాల మార్పులు, అవయవదానం కోసం వ్యక్తుల డిక్లరేషన్ లాంటి సమాచారం ప్రభుత్వానికి లభిస్తుంది.

ఇక ఆర్సీల విషయానికొస్తే.. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియను కాగితాన్ని ఉపయోగించకుండా చేయాలని నిర్ణయించుకుంది. కొత్త ఆర్సీకి యజమాని పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటుంది.

పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు ఉండవు

పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు ఉండవు

అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డు ఉపయోగించే చెల్లింపులకు డిస్కౌంట్ల లభించవు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఆయిల్ కంపెనీలు క్రెడిట్/డెబిట్ కార్డులకు, ఈ వ్యాలెట్లకు ఇప్పటి వరకు డిస్కౌంట్లను అందజేశాయి. అయితే, డెబిట్ కార్డులు, ఇతర పద్ధతుల డిజిటల్ పేమెంట్లకు మాత్రం డిస్కౌంట్ కొనసాగుతుంది.

హోం, కారు, పర్సనల్ లోన్ రేట్లలో తగ్గుదల

హోం, కారు, పర్సనల్ లోన్ రేట్లలో తగ్గుదల

బ్యాంకులు తమ రిటైల్, ఎంఎస్‌ఎంఇ రుణాలను బాహ్య వడ్డీ రేటు బెంచ్‌మార్క్‌లతో అనుసంధానించడం రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) తప్పనిసరి చేసింది, దీంతో ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాల రేట్లు తగ్గుతాయి.

నెలవారీ సగటు బ్యాలెన్సు, దానిపై పెనాల్టీ తగ్గించనున్న ఎస్బీఐ

నెలవారీ సగటు బ్యాలెన్సు, దానిపై పెనాల్టీ తగ్గించనున్న ఎస్బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సగటు నెలవారీ బ్యాలెన్స్ తగ్గించడానికి సిద్ధమైంది.
మెట్రో, పట్టణ కేంద్రాలలో ఖాతా ఉన్నవారికి, ఏఎంబీ రూ .3,000, గ్రామీణ శాఖలకు ఇది 1000 రూపాయలుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని నిర్వహించలేకపోతే వేసే ఛార్జీ మొత్తాన్ని కూడా తగ్గించనుంది.

ఉదాహరణకు ఒక కస్టమర్ మెట్రో, అర్బన్ సెంటర్ బ్రాంచ్‌లలో రూ .3,000 ఎఎమ్‌బిగా నిర్వహించడంలో విఫలమైతే, 50 శాతం తగ్గితే, ఆ వ్యక్తికి రూ .10 తో పాటు జిఎస్‌టి వసూలు చేస్తారు. ఒకవేళ ఖాతాదారుడు 50-75 శాతానికి మించి తగ్గితే, అతడు / ఆమె రూ .12 జరిమానాతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ఒకవేళ ఖాతాదారుడు 75 శాతానికి మించి తగ్గితే, అది రూ .15 జరిమానాతో పాటు జీఎస్టీని చెల్లించాలి.

అక్టోబర్ 1 నుంచి తగ్గనున్న కార్పొరేట్ టాక్స్

అక్టోబర్ 1 నుంచి తగ్గనున్న కార్పొరేట్ టాక్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా అక్టోబర్ 1 నుంచి కార్పరేట్ టాక్స్ తగ్గనుంది.

English summary
Prime Minister Narendra Modi-led government at the Centre recently made a change in issuing vehicle Registration cards (RCs) and driving licenses (DLs) in the country. It is likely that you would have to update your driving licenses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X