వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగాల్లేవు, ఆర్థిక వ్యవస్థ కుదేలు: అన్నిటికీ ఒకే కారణం అది ఇదే..!

|
Google Oneindia TeluguNews

2016లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల కారణంగానే ఈ రోజు భారత్‌లో ఇటు పరిశ్రమలు అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఆర్థికవేత్త గాబ్రియేల్ , ఐఎంఎఫ్‌ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ చెప్పారు. అంతేకాదు నాటి డీమోనెటైజేషన్‌తో ఉద్యోగాల కల్పన కూడా భారీగా పడిపోయిందన్నారు.

మార్కెట్లలో కనిపించిన నగదు కొరత

మార్కెట్లలో కనిపించిన నగదు కొరత

2016 నవంబర్‌లో మోడీ సర్కార్ పెద్దనోట్లను రద్దు చేసింది. నల్లధనంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు ప్రధాని . అదే సమయంలో ఉగ్రసంస్థలకు నిధులు కూడా ఈ పెద్ద నోట్ల ద్వారా చాలా తేలిగ్గా చేరిపోతున్నాయని చెప్పారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ ప్రకటనతో ఒక్కసారిగా దేశం రోడ్లపైకి వచ్చింది. అర్థరాత్రి నుంచే రూ.1000, రూ.500 నోట్లు చెలామణి కావన్న ప్రకటనతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో మార్కెట్లలో నగదు షార్జేటీ కనిపించింది. మార్కెట్లలో ఆందోళన కనిపించిందని గాబ్రియేల్ మరియు గీతా గోపీనాథ్‌లు పేర్కొన్నారు. "క్యాష్ అండ్ ఎకనామి : ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియాస్ డీమోనెటైజేషన్" పేరుతో ప్రచురించిన పేపర్‌లో వారు ఈ విషయం పొందుపర్చారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమే కాకుండా ఉద్యోగాల కల్పన కూడా 2 నుంచి 3శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.

 2-3శాతం పడిపోయిన ఉద్యోగాల కల్పన

2-3శాతం పడిపోయిన ఉద్యోగాల కల్పన

భారత్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆయా జిల్లాల్లో ఈ ప్రభావం ఎంతమేరకు చూపించిందనే విషయమై గీతాగోపీనాథ్, గాబ్రియేల్, గోల్డ్ మ్యాన్ శాక్స్‌కు చెందిన ప్రాచి మిశ్ర మరియు ఆర్బీఐలో పనిచేస్తున్న అభినవ్ నారాయణన్‌లు ఈ స్టడీలో పాల్గొన్నారు. ఇక పెద్ద నోట్ల రద్దుతో అత్యంత ఇబ్బందులు పడ్డ జిల్లాలను పరిశీలిస్తే ఎక్కువమంది ఏటీఎంలలో డబ్బులు లేక ఇక్కట్లు పడ్డట్టు వారు తెలిపారు. 2016 నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆర్థిక వ్యవస్థ కూడా 2.2 శాతంకు పడిపోయినట్లు స్టడీ ద్వారా చెప్పారు. ఇక 2016 చివరినాటికి వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గిపోవడంతో రుణాలు ఇవ్వడం కూడా 2శాతం పడిపోయిందని పేర్కొంది.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం

ఇక పెద్ద నోట్లు రద్దు అవుతాయని తెలిసి కూడా ఆర్బీఐ కొత్త నోట్లను ముద్రించలేకపోవడంతో వ్యవస్థలో క్యాష్ ఇబ్బందులు తలెత్తాయని వీరు తమ స్టడీ ద్వారా చెప్పారు. ఆర్బీఐ ప్రభుత్వాలు ఈ విషయంలో గోప్యత వహించారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొత్తం రద్దయిన కరెన్సీలో సూక్ష్మ భాగంలో కొత్త కరెన్సీ ప్రింట్ అయ్యింది. ఒక్క రాత్రిలోనే 75శాతం కరెన్సీ తగ్గిపోయిందని చెప్పిన సభ్యులు ఆ తర్వాత క్రమంగా కొన్ని నెలల సమయంలో పుంజుకుందని వెల్లడించారు.

English summary
After demonetisation , Indian economy collapsed and job creation also reduced by 2 to 3 percent said a new study done by Gabriel of Harvard, and IMF's Gita Gopinath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X