వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: జీఎస్టీతో 1.3 లక్షల కొత్త ఉద్యోగాలు, టెక్కీలకు డిమాండ్

దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ఈ ఏడాది జూలై నుండి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.అయితే జీఎస్టీ అమలు వల్ల కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి. టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ఈ ఏడాది జూలై నుండి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.అయితే జీఎస్టీ అమలు వల్ల కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి. టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడనుంది.

దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 1వ, తేది నుండి జీఎస్టీని అమలు చేయనుంది. ఈ నెల 30వ, తేదిన జీఎస్టీ ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తోంది కేంద్రం.

పార్లమెంట్ భవనం వేదికగా జీఎస్టీని అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్రపతి, మాజీ ప్రధానులు, పార్లమెంట్ సభ్యులు జీఎస్టీ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

జూన్ 30వ, తేది నుండి తెల్లవారుజామువరకు అనేక కార్యక్రమాలను పార్లమెంట్ భవనం వేదికగా నిర్వహించనుంది కేంద్రం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు కానుంది.

జీఎస్టీ అమలుతో కొత్త ఉద్యోగాలు

జీఎస్టీ అమలుతో కొత్త ఉద్యోగాలు

జీఎస్టీ అమలు ద్వారా ట్యాక్స్ కన్సల్టెంట్లకు, టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. జీఎస్టీ అమలు చేసిన తర్వాత ట్యాక్స్ కన్సల్టెంట్లు, టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా 1.3 లక్షల నిపుణులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

ఈ రంగాల్లో భారీగా డిమాండ్

ఈ రంగాల్లో భారీగా డిమాండ్

ఎఫ్ఎంసీజీ రంగంలో భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కన్సూమర్ గూడ్స్, ఫార్మాసూటికల్స్, రియల్ ఏస్టేట్, బ్యాంకింగ్ , ఇన్సూరెన్స్ రంగాల్లో పన్ను టెక్నాలజీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పన్ను విధానంతో ప్రయోజనాలు పొందడానికి సంస్థలు వీరిని నియమించుకోనున్నారు.

జీఎస్టీ నమోదు చేసుకొన్న కంపెనీలు 90 లక్షలు

జీఎస్టీ నమోదు చేసుకొన్న కంపెనీలు 90 లక్షలు

దేశవ్యాప్తంగా జీఎస్టీని నమోదుచేసుకొన్న కంపెనీలు చివరికి 90 లక్షలుగా ఉంటాయని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.వారిలో 1 శాతం పెద్ద కంపెనీలుంటే , ఆ కంపెనీలకు జీఎస్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి కనీసం ఐదుగురు నిపుణులు అవసరం పడతారని చెప్పారు. అంతేకాదక 10 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో కనీసం ఒక వ్యక్తి అవసరం ఉంటుంది. దీంతో కొత్త జీఎస్టీ విధానంతో 1.3 లక్షల నిపుణులకు డిమాండ్ ఏర్పడనుంది.

ప్రతిభావంతులకు అవకాశాలు

ప్రతిభావంతులకు అవకాశాలు

కొన్ని బాధ్యతలను ప్రస్తుతమున్న సేల్స్, ఇతర పన్నుల నిపుణులను నిర్వర్తించవచ్చు. కానీ, కొత్తగా ప్రతిభావంతులను కూడ నియమించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. పన్నువైపుగా అయితే లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. టెక్నాలజీ వైపు అయితే సాఫ్ట్ వేర్ నిపుణఉలకు అవసరం ఎక్కువగా ఉంటుంది.

సెమీ స్కిల్డ్ వర్కర్లకు కూడ డిమాండ్

సెమీ స్కిల్డ్ వర్కర్లకు కూడ డిమాండ్

సెమీ స్కిల్డ్ వర్కర్లకు కూడ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ రిటర్న్స్ లను ప్రభుత్వ డేటా బేస్ లతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ మేనేజర్, వీపీ-జీఎస్టీ లేదా జీఎస్టీ టీమ్ లీడర్ వంటి కొన్ని పొజిషన్లు క్రియేట్ అవుతాయని ఓ సంస్థ సీనియర్ డైరెక్టర్ చెప్పారు. కొత్త జీఎస్టీ విధానం అమలు చేయకపోతే కంపెనీలే నష్టపోయే అవకాశం ఉంది. దీంతో ఆయా కంపెనీలు మార్కెట్ షేర్ ను కోల్పోయే అవకాశం ఉంది. కార్పోరేట్ సంస్థలు జీఎస్టీపై ఎంతో బాధ్యతతో పనిచేసేవారు పనిచేసేవారిని తీసుకోవాల్సి ఉంటుంది. మంచి ప్రణాళికతో దీన్ని అమలుచేస్తే , అన్ని సమస్యలను అధిగమించవచ్చు.

English summary
Gst has infused optimism in the job market.As the goods and service tax rollout date nears, companies across sectors are rushing to get their GST teams in place. leading to a jump in demand for tax and technology professionals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X