వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రైవర్ వివరణ: జయలలిత హాస్పిటల్‌లో చేరకముందు ఏం జరిగింది..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

జయ మరణం: ‘అమ్మ’ డ్రైవర్‌ కీలక సమాచారం

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డెత్ మిస్టరీ మరో మలుపు తీసుకుంది. జయలలిత చనిపోయే వరకు ఆమె వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేసిన కన్నన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 1991 నుంచి కన్నన్ జయలలితకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

సెప్టెంబర్ 22, 2016లో జయలలిత గదిలోకి తాను వెళ్లగా అప్పటికే ఓ కుర్చీలో కూర్చొని అపస్మారక స్థితిలో ఉండటాన్ని తాను చూసినట్లు కన్నన్ తెలిపాడు. రాత్రి 10 గంటలకు జయలలిత వ్యక్తిగత భద్రతా అధికారి వీరపెరుమాల్ కారు తీసుకురావాల్సిందిగా తనను ఆదేశించాడని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత మరో పెద్ద కారు తీసుకురావాల్సిందిగా అమ్మ దగ్గర పనిచేసే పనిమనిషి చెప్పిందన్న కన్నన్... పెద్ద కారు తెచ్చాక శశికళ పిలుస్తున్నారని చెప్పడంతో గదిలోకి వెళ్లినట్లు కన్నన్ చెప్పాడు.రెండో అంతస్తులో ఉన్నఅమ్మ గదిలోకి వెళ్లగానే అక్కడే కొన్ని ఫైళ్లు మరో పెన్ను కిందపడి ఉండటాన్ని గమనించినట్లు కన్నన్ వివరించాడు.ఇక స్పృహ కోల్పోయి ఉన్న జయలలితను కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించినట్లు గుర్తుచేశాడు. రెండు సార్లు ప్రయత్నించాక... ఆ ప్రయత్నాన్ని విరమించి స్ట్రెచర్‌లో అమ్మను తరలించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

New twist:Jayalalithaas driver reveals what took place before her hospitalization

" పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసానికి శశికల బంధువు, జయలలితకు వ్యక్తిగత డాక్టరుగా పనిచేసే కేఎస్ శివకుమార్ అమ్మ ఇంట్లో రాత్రి 8:30 గంటలకు చూశాను. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన పోయెస్ గార్డెన్ వదిలి ఆయన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడొచ్చారో తెలియదు" అని శివకుమార్ అరముగస్వామి కమిషన్‌కు స్టేట్ మెంట్ ఇచ్చాడు.

మొత్తానికి జయలలిత మృతిపై విచారణ చేస్తున్న అరముగస్వామి కమిషన్‌కు శశికళ ఇచ్చిన వివరణ, డ్రైవర్ కన్నన్ ఇచ్చిన వివరణ రెండు వేర్వేరుగా ఉండటంతో జయలలిత మృతి మిస్టరీగా మారింది. అయితే ఇప్పటివరకు కమిషన్ ఎవరికీ అంటే ఎయిమ్స్ వైద్యులకుగానీ, ఆనాటి జయలలిత కేబినెట్ మంత్రులకు గానీ, అపోలో హాస్పిటల్ వర్గానికి గానీ ఎలాంటి నోటీసులు పంపలేదు.

English summary
Tamilnadu former Chief Minister Jayalalitha's death mystery is taking turns and twists. Justice A.Arumughasamycommission appointed to enquire into the death mystery of the former CM, said that there were few interesting information given by Amma's personal driver Kannan. But the fact is the statement that of Kannan is different from that of Sasikala, said the commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X