వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెప్టెంబర్ 1 నుంచి కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రూ.24వేల బీమా చెల్లించాలి

|
Google Oneindia TeluguNews

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహనాలకు ఒకేసారి మూడు నుంచి ఐదేళ్లవరకు బీమా సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఇన్ష్యూరెన్స్ కంపెనీలకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి కొనుగోలు చేసే కార్లకు ఐదేళ్ల పాటు ఇన్ష్యూరెన్స్, మోటార్ బైకులకు మూడేళ్లపాటు ఇన్ష్యూరెన్స్ కల్పిస్తామని బీమా సంస్థలు తెలిపాయి. ఇది అమల్లోకి వస్తే కారు కొనుగోలు చేసేవారు రూ.24వేలు, మోటార్ బైకులు కొనేవారు రూ.13వేలు ఇన్ష్యూరెన్స్‌ కోసం కట్టాల్సి ఉంటుంది.

సుప్రీం కోర్టు చెప్పినట్లుగానే వచ్చే నెల నుంచి కొత్త బీమా పద్ధతిని అమలు చేయాలని థర్డ్ పార్టీ ఇన్ష్యూరెన్స్ కంపెనీలకు ఇన్ష్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌డీఏ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి ఇన్ష్యూరెన్స్ సంస్థలు దీర్ఘకాల పద్దతిలో అంటే ఐదేళ్లకు గానీ మూడేళ్లకు గానీ బీమా కల్పిస్తాయి. ఒక వేళ బీమా కలిగిన వాహనం ప్రమాదానికి గురై ఆ వాహనం కారణంగా ఎవరికైనా గాయాలు కానీ, మరణం కానీ సంభవిస్తే అట్టి థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్ష్యూరెన్స్ సంస్థలు బీమా చెల్లిస్తాయి.

New vehicles purchased from 1st September had to be paid Rs 24000/-

జూలై 20,2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్ష్యూరెన్స్ ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. అంతకుముందు ఒక్క సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. థర్డ్ పార్టీ ఇన్ష్యేరెన్స్ కొత్త రేట్లు సెప్టెంబర్ 1,2018 నుంచి మార్చి 31,2019 మధ్య కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుంది. వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే మొత్తం మూడేళ్లకుగానీ ఐదేళ్లకుగానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాది లెక్కనే దాన్ని గుర్తిస్తారు. వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్ష్యూరెన్స్ రద్దు చేసి...కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.

ప్రీమియం రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రైవేట్ కార్లకు మూడేళ్ల ప్రీమియం రేట్లు

1000సీసీ మించకుండా ఉండే వాహనంకు: రూ.5,286/-

1000సీసీ నుంచి 1500సీసీ మధ్య ఉండే వాహనం: రూ.9,534

1500 సీసీకి మించి వాహనం ఉంటే: రూ. 24,305

ద్విచక్ర వాహనాలు:

ఐదేళ్ల ప్రీమియం రేట్లు

75 సీసీ మించకుండా ఉండే బైకు: రూ.1,045

75సీసీ నుంచి 150 సీసీ మధ్య ఉండే బైకు: రూ. 3,285

150 సీసీ నుంచి 350 సీసీ మధ్య ఉండే బైకు: రూ. 5453

350 సీసీకి మించి ఉండే బైకు: రూ.13,034

English summary
The Supreme Court has ordered all general insurers to offer long-term third party insurance on vehicles sold on or after September 1. In line with the court directive, insurance companies will now offer only three-year insurance for cars and five-year insurance for two-wheelers under the third party segment from the next month. Following the implementation of the Supreme Court order, prospective vehicle buyers will have to pay more than Rs 24,000 for new cars and over Rs 13,000 for new motorcycles in third-party insurance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X