వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీశ్ సిసోడియా ఇళ్లలో సోదాలు పూర్తి.. ఆర్టికల్‌పై కామెంట్ప్‌పై న్యూయార్క్ టైమ్స్ గుర్రు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీశ్ సిసోడియా ఇళ్లు, కార్యాలయాల వద్ద సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 15 గంటలపాటు రైడ్ జరిగాయి. అయితే అంతకుముందు ఢిల్లీలో మంచి విద్య, ఇతర అంశాలపై న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఆర్టికల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త పెయిడ్ ఆర్టికల్ అని బీజేపీ విమర్శలు చేసిన నేపథ్యంలో ఆప్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీనిపై న్యూయార్క్ టైమ్స్ కూడా స్పందించింది. తాము జర్నలిజం, విలువలకు ప్రాధాన్యం ఇస్తామని.. ఉన్నది ఉన్నట్టు రాస్తామని చెప్పింది.

 నిజ నిజాలు తెలుసుకుని..

నిజ నిజాలు తెలుసుకుని..

ఢిల్లీలో వైద్య సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలో చక్కని బోధన గురించి తాము పరిశోధన చేసి కథనాలు రాశామని తెలిపింది. ఇప్పుడే కాదు గత కొన్నేళ్లుగా న్యూయార్క్ టైమ్స్ కవర్ చేస్తుందని తెలిపింది. తమ జర్నలిజం ఎప్పటికీ స్వతంత్ర ప్రాతిపదికన పనిచేస్తోందని తెలిపింది. తమపై రాజకీయ ఒత్తిడి కానీ.. యాడ్ల ప్రభావం ఉండదని పేపర్ అధికార ప్రతినిధి నికొల్ టేలర్ తెలిపారు.

15 గంటలు సోదాలు

15 గంటలు సోదాలు

దాదాపు 15 గంటలపాటు సీబీఐ సోదాలు నిర్వహించింది. అవకతవకలకు సంబంధించి ఏకకాలంలో 30 చోట్ల రైడ్స్ చేసింది. పలు పత్రాలు, సమాచారాన్ని సీబీఐ అధికారులు తీసుకెళ్లారు. సిసోడియాతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. లిక్కర్ ట్రేడర్ సిసోడియాకు రూ.కోటి రూపాయలు ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. విచారణకు సిసోడియా సహకరించకుంటే.. అతనిని అరెస్ట్ చేస్తామని సీబీఐ అంటోంది.

 సీఎస్ నివేదిక.. రంగంలోకి సీబీఐ

సీఎస్ నివేదిక.. రంగంలోకి సీబీఐ

మనీశ్ సిసోడియా నివాసంలో శుక్రవారం సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల కేసులో సీబీఐ సోదాలు నిర్వహించారు. గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. కొత్త పాలసీలో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.దీంతో కొత్త మద్యం పాలసీపై నివేదిక ఇచ్చిన సీఎస్.. ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలున్నాయని చెప్పారు. టెండర్ల విధానంలో కొందరికి ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పొందు పరిచారు. ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పాత్రను అందులో ప్రస్తావించారు. సీఎస్ నివేదిక ఆధారంగా కొత్త మద్యం పాలసీలో జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐకి సిఫారస్ చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తులో భాగంగా సోదాలు చేపట్టింది.

English summary
Delhi Deputy Chief Minister Manish Sisodia’s New York Times issued a strong response making it clear that its front-page article on the politician's transformation of Delhi's healthcare system was completely unbiased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X