వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌తో పోలిక, భారత్‌కు రామ్‌దేవ్ బాబా ప్రధాని కాగలరు: న్యూయార్క్ టైమ్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: యోగా గురువు రామ్ దేవ్ బాబాను న్యూయార్క్ టైమ్స్ పత్రిక అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చింది. రామ్‌దేవ్ కూడా భవిష్యత్తులో భారత దేశానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ట్రంప్‌కు, రామ్‌దేవ్ బాబాకు పలు సారూప్యతలు ఉన్నాయని తెలిపింది.

'ది బిలియనీర్ యోగి బిహైడ్ మోడీ రైజ్'.. మోడీ ఎదుగుదల వెనుక బిలియనీర్ యోగి, పేరుతో కథనం ఇచ్చింది. రామ్‌దేవ్ బాబా భారత్‌తో పాటు విదేశాల దృష్టిని ఆకర్షిస్తున్నారని తెలిపారు.

New York Times compares Baba Ramdev to Donald Trump, says he could be Indias future PM

డొనాల్డ్ ట్రంప్ వలె బాబా కూడా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి నేతృత్వం వహిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. భారత్‌లో ఆయనకు తిరుగులేని ఆదరణ ఉందని, దేశంలోని ప్రతిచోట అతని పేరు, ముఖం కనిపిస్తాయని తెలిపింది. భారత్‌లోనే అత్యంత శక్తిమంతమైన ప్రధాని కాగలడని అభిప్రాయపపడింది. పార్టీలకు అతీతంగా పోటీ పడవచ్చునని తెలిపింది.

ఆధ్యాత్మిక పరంగా కూడా ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొంది. హిందువుల హక్కులపై ఆయన గళమెత్తుతారని, 2014 ఎన్నికల్లో ఆయన చేసిన అప్రకటిత ప్రచారం కూడా మోడీ ప్రధాని కావడానికి బాగా సహాయపడిందని పేర్కొంది. మోడీ అధికారంలోకి వచ్చాక తాజా రాజకీయ మార్పులకు అనుగుణంగా రామ్‌దేవ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది.

English summary
A recent feature in the New York Times compared Ramdev with the US President Donald Trump and even predicted that he could be India’s next Prime Minister. It said that Ramdev will eventually rise to the top of India’s politics and how he helped bring PM Narendra Modi to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X