వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకాన్ని చూడకముందే కానరానిలోకాలకు చిన్నారి: డాక్టర్ల సమ్మెతో అప్పుడే పుట్టిన బిడ్డ మృతి

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ : బెంగాల్‌లో జరుగుతున్న డాక్టర్ల సమ్మె అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలు తీసింది. ఇప్పటికే డాక్టర్ల సమ్మెతో పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవల సమయంలో డాక్టర్లు దగ్గర లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రముఖ బెంగాలీ దినపత్రిక ఆనంద్ బజార్ పత్రిక విడుదల చేసిన ఫోటోలు చూస్తే గత నాలుగురోజులుగా డాక్టర్ల సమ్మెతో ఆరోగ్య వ్యవస్థ ఎలా తయారైందో తెలుస్తుంది.

రైల్వే టీటీఈలకు కొత్త బాధ్యత..ఇకపై రైళ్లో వాటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది <br>రైల్వే టీటీఈలకు కొత్త బాధ్యత..ఇకపై రైళ్లో వాటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది

అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో ఆ బిడ్డ మృతదేహాన్ని తన చేతుల్లో ఉంచుకుని విలపిస్తున్న తండ్రి ఫోటో పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సరైన సమయానికి చిన్న బిడ్డకు చికిత్స అందకపోవడంతో బిడ్డ లోకాన్ని చూడకముందే కానరానిలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఫోటోను ఫోటోగ్రాఫర్ దమయంతి దత్త తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజెన్లకు కంటతడిపెట్టించింది.

Newly born Baby dies due to doctors protest in Bengal

పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్లు చేపట్టిన సమ్మెకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సమ్మెకు దిగారు. పెద్ద నగరాల్లో అత్యవసర సేవలు సైతం నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాదులాంటి నగరాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. బెంగాల్‌లో ఒకటి రెండు హాస్పిటల్లో మినహా ఎక్కడా అత్యవసర సేవలను కొనసాగించడం లేదు. ప్రముఖ నీల్ రతన్ సర్కార్ హాస్పిటల్‌లో కూడా సేవలు బంద్ చేశారు డాక్టర్లు. ఇక ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు అయితే తాము సమ్మె చేస్తున్నామని వేరే హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా పేషెంట్లకు చెబుతున్నారు.

ఆకస్మిక చర్యల కింద చాలా పరిమిత కేసులు మాత్రమే చూస్తామని, తిరిగి పరిస్థితులు చక్కబడేవరకు ఇది కొనసాగుతుందని ఎయిమ్స్ సూపరింటెండెంట్ ఒక మెమో జారీ చేశారు. మహారాష్ట్రలో 4500 మంది డాక్టర్లు సమ్మె చేయడంతో అక్కడ సేవలు నిలిచిపోయాయి.

English summary
As Bengal healthcare services reel under the ongoing protests by doctors across the state, several patients and their families have been left in the lurch. Several patients who need critical care and services were left to fend for themselves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X