బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన వారానికే ఉమాశంకర్(44) మృతి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై కేవలం వారం రోజులకే కన్నుమూశారు రమీల ఉమాశంకర్(44). సెప్టెంబర్ 28న జేడీఎస్‌కు చెందిన రమీల ఉమాశంకర్(44) బెంగళూరు నగర డిప్యూటీ మేయర్‌గా ఎంపికయ్యారు.

బాధ్యతలు తీసుకుని కనీసం వారమైనా గడవకముందే గురువారం రాత్రి తీవ్ర గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె కావేరీపుర వార్డు కార్పొరేటర్. ఉమాశంకర్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్త అని, పార్టీ కోసం ఎంతో చేశారని అన్నారు.

Newly-Elected Bengaluru Deputy Mayor, 44, Dies Of Heart Attack

జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం యడ్యూరప్ప రమీల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిన్న కూడా రమీల మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమె మరణం షాక్‌కు గురిచేసింది' అని పలువురు నేతలు వ్యాఖ్యానించారు.

రమీల మరణం బాధ కలిగిస్తోందని మరికొందరు నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రమీల మృతికి సంతాపంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) నగరంలోని పాఠశాలలు, కళశాలలకు సెలవు ప్రకటించింది.

English summary
Bangalore's newly-elected Deputy Mayor, Ramila Umashankar of the Janata Dal (Secular), died of a massive heart attack on Thursday night. The 44-year-old was rushed to a hospital after she complained of severe chest pain at about 12.45 am but died without responding to treatment, family sources said. She is survived by her husband D Umashankar and two children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X