• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మందుల కోసం వెళ్లి.. అత్తగారిల్లు మరిచి, ఊరుకాని ఊరిలో.. రాత్రంతా.. బిక్కుబిక్కుమంటూ...

By Ramesh Babu
|

నోయిడా: సంప్రదాయం ప్రకారం.. తలపై కప్పుకునే దుపట్టా ఓ యువతి కొంపముంచింది. దుపట్టా ముసుగులో పరిసరాలను గమనించలేకపోవడం ఆమెకు ఊహించని కష్టాన్ని తెచ్చిపెట్టింది.

మందుల కోసం బయటకొచ్చిన ఆ యువతి అత్తాగారింటికెళ్లాల్సిన దారి మరచిపోయి గందరగోళంలో పడింది. దీంతో తెల్లరేదాకా గుర్తు తెలియని ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. కుటుంబసభ్యులను కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటు చేసుకుంది.

puja-rohtak

హర్యానాలోని రోహ్‌తక్ ప్రాంతానికి చెందిన పూజకు ఆర్నెల్ల క్రితం నోయిడా శివార్లలోని కాన్పూర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆమె భర్త కొన్నిసార్లు రోజుల తరబడి విధులు నిర్వహిస్తూ.. ఇంటికి వచ్చేవాడు కాదు.

సెప్టెంబర్ 30న సాయంత్రం పూజ.. ఓ వైద్యుణ్ని సంప్రదించి మందులు తెచ్చుకోడానికి బిలాస్‌పూర్‌కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో దారి మరచిపోయి బుందేల్‌ఖేడా అనే మరో ప్రాంతానికి చేరుకుంది.

భయం భయంగా ఓ చోట నిల్చొని కంగారు పడుతున్న పూజను కొంత మంది స్థానికులు గమనించి విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పేరు పూజ అని, అత్తాగారింటికి వెళ్లాల్సిన దారి మరచిపోయాయని చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

'నా అత్తగారి పేరు రామ్‌వతి.. నా భర్త డ్రైవర్‌గా పని చేస్తాడు'.. పూజ చెప్పిన వివరాలు ఇంతే. కనీసం అత్తాగారి ఊరు పేరు కూడా ఆమెకు తెలియదు. ఆమె దగ్గర సెల్‌ఫోన్, గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ఆమె చిరునామా కనిపెట్టడం తలకు మించిన భారమైంది.

దీంతో పూజ.. ఆ రాత్రంతా బుందేల్‌ఖేడాలోని ఉండాల్సి వచ్చింది. స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. బాగా చీకటి పడే వరకూ ప్రయత్నించినా ఎలాంటి పురోగతి లభించకపోవడంతో.. సోమవారం పొద్దున పోలీసులు.. పూజను వెంటబెట్టుకొని ఆమె వచ్చిన మార్గం వైపు ప్రయాణం ప్రారంభించారు.

సిర్సా చౌక్ వద్దకు చేరుకోగానే.. పూజకు ప్రాణం లేచొచ్చినంత పనైంది. అక్కడ నుంచి తన అత్తారింటికి వెళ్లే దారి ఆమెకు గుర్తొచ్చేసింది. దీంతో పోలీసులు.. పూజ చెప్పిన గుర్తుల ఆధారంగా ఆమె అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు. పాపం వారు కూడా కోడలి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పూజ కనిపించగానే ఆమె అత్తింటి వారు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
A shocking incident has been emerged from Noida where A newly married woman forgot way of her in laws house due to veil in Greater Noida. Her name is Puja. She was married to man who is working as Driver. Her in-law name is Ramvathi. On September 30 Evening.. Puja went Bilaspur where she wants to meet a doctor to brought medicines. While returning she forget her in-laws area and went to Bundelkheda. Locals tried to bring her back to her in-laws house but she don't know atleast the name of the area where her in-laws staying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more