వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొంపముంచిన కరోనా భయం:పెళ్లాంతో ఫిజికల్ డిస్టెన్స్ -మగతనం లేదంటూ రచ్చ -భర్తకు పటుత్వ పరీక్ష

|
Google Oneindia TeluguNews

కరోనా రక్కసి ఇప్పటికే 15 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. మన దేశంలో మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 1లక్షా40వేలు దాటేసింది. 13 నెలలుగా కరోనా విలయకాలాన్ని ఎదురీదుతోన్న మనం ఎన్నెన్నో సీరియస్ సంఘటనలతోపాటు సిల్లీ విషయాలను కూడా విన్నాం. కరోనా తొలినాళ్లలో వైరస్ బారినపడ్డవాళ్లకు సహాయ నిరాకరణ, ఫ్రంట్ లైన్ వారియర్లపై దాడుల వంటి అసాధారణ దృశ్యాలనూ చూశాం. లాక్ డౌన్ దెబ్బకు ఉపాధి లేకనో, కుటుంబానికి దూరమైపోయామనే కుంగుబాటుతోనో ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అదే సమయంలో కరోనాపై లేనిపోని భయాలకులోనై జీవితాలను ఆగం చేసుకున్నవాళ్లనూ చూశాం. అన్నింటిలోకీ ఇప్పుడు చదవబోయేది అరుదైన వ్యవహారంగా నిలిచింది..

దుబ్బాక,గ్రేటర్: ఒత్తిడిలో ఏపీ బీజేపీ -తిరుపతిలో జగన్‌కు చుక్కలే -నిమ్మగడ్డపైనా సోము వీర్రాజు ఫైర్దుబ్బాక,గ్రేటర్: ఒత్తిడిలో ఏపీ బీజేపీ -తిరుపతిలో జగన్‌కు చుక్కలే -నిమ్మగడ్డపైనా సోము వీర్రాజు ఫైర్

 కొత్తగా పెళ్లి.. కరోనా భయం..

కొత్తగా పెళ్లి.. కరోనా భయం..

కరోనా ఫోబియాతో కొంపలు మునిగిన సందరు సంఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. స్థానిక ఆరోగ్య, పోలీస్, న్యాయ శాఖల అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. భోపాల్ సిటీకి చెందిన ఓ యువ జంట.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా ఈ ఏడాది జూన్ 29న ఒక్కటయ్యారు. ఎలాగోలా తాళి కట్టేసి, పెళ్లి తంతును మమ అనిపించిన ఆ యువకుడు.. తీరా శోభనం, సంసారం దగ్గరికొచ్చేసరికి భయంతో గజగజలాడిపోయాడు. కరోనా ఫోబియా వెంటాడగా, కొత్త పెళ్ళాంతోనూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాడు. కనీసం..

 మగాడివి కాదంటూ తిట్టిపోసిన భార్య

మగాడివి కాదంటూ తిట్టిపోసిన భార్య

తన భర్త.. పడక గదిలో కనీసం రెండు గజాల దూరం పాటించేవాడని, కనీసం మామూలుగా మాట్లాడే సమయంలోనూ దగ్గరికి వచ్చేవాడు కాదని, అతనికి నచ్చచెప్పడానికి, దారిలోకి తెచ్చుకోడానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని భార్య చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ సమయంలో మిగతా జంటలన్నీ అదే పనిలో ఉండగా, తనకు మాత్రం ఈ శిక్ష ఎందుకో అర్థం కాలేదని, ఆలోచించగా.. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిందని, బహుశా అతను మగాడు కాదేమోననే సందేహం బలపడసాగిందని భార్య పేర్కొంది. భర్త తీరును భరించలేని స్థితిలో.. నువ్వు మగాడివేకాదు, సంసారానికి పనికిరావని తిట్టిపోస్తూ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ వెంటనే..

ఫిర్యాదు.. పటుత్వ పరీక్షలు

ఫిర్యాదు.. పటుత్వ పరీక్షలు

సంసారానికి పనికిరాని వ్యక్తితో ఎల్లకాలం జీవించలేనని తల్లిదండ్రులకు తెగేసి చెప్పిన ఆ యువతి.. విడాకులు, భరణం కోరుతూ కోర్టుకెక్కింది. అంతేకాదు, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ భర్తపై కేసు కూడా పెట్టింది. లాక్ డౌన్ సమయంలో భర్తతో చనువుగా కలిసుండేందుకు అడ్డు పడ్డారంటూ అత్తింటివాళ్లపైనా ఆరోపణలు చేసింది. అనుభవజ్ఞులైన న్యాయాధికారులు.. ఆరోగ్య శాఖ సహకారంతో ఈ సమస్యకు తెలివైన పరిష్కారం చూపారు. ముందుగా భర్తకు పటుత్వ పరీక్షలు నిర్వహించి, కౌన్సిలింగ్ చేయగా...

 చివరికి నిజం బయటపడిందిలా..

చివరికి నిజం బయటపడిందిలా..

కొత్త భార్య విషయంలో అంత కఠినంగా ఎందుకు వ్యవహరించావని కౌన్సిరల్లు అడ్డగా, అప్పుడుగానీ మనోడు అసలు నిజాల్ని బయటపెట్టాడు. అసలేం జరిగిందంటే.. జూన్ లో పెళ్లి వేడుక తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు కరోనా సోకింది. కొంతకాలం ట్రీట్మెంట్ తర్వాత వారు కోలుకున్నారు. ఆ వైరస్ తన భార్యకు కూడా సోకిందని భర్త బలంగా నమ్మాడు. ఆమెలోని ఇమ్యూనిటీ కారణంగా లక్షణాలు బయటపడలేదని, లోలోన వైరస్ అలాగే ఉందని నమ్మబట్టే ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలనని భర్త చెప్పుకొచ్చాడు. అంతా విన్న కౌన్సిలర్లు అమ్మాయి కూడా కరోనా టెస్టులు చేయించి నెగటివ్ రిపోర్టులను భర్త చేతిలో పెట్టారు. అదే సమయంలో అతను సంసారానికి పనికి వస్తాడని నిరూపించే పటుత్వ పరీక్షల రిపోర్టును భార్య చేతిలో పెట్టారు. చివరికి ఇద్దరి చేతులు కలిపేసి, ఇంటికి పంపించేశారు.

Recommended Video

Amid Mysterious Illness CM YS Jagan To Visit Eluru Today

గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్‌లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్‌లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..

English summary
Due to Coronaphobia, a man from Madhya Pradesh's Bhopal became the victim of his wife's suspicion and had to undergo potency test. man who got married on June 29 this year, started maintaining a distance from his wife ever since their marriage. This behaviour of the husband made the newly wed bride suspect him as an impotent man, following which she left him and went to live with her parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X