• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యూస్ మేకర్స్ 2019: చంద్రయాన్-2తో ప్రపంచానికి తెలిసిన రాకెట్ మ్యాన్ శివన్

|

చంద్రయాన్-2... ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న విషయం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్‌ సమాచార వ్యవస్థలో లోపం తలెత్తడంతో గతి తప్పింది. అప్పటివరకు మిషన్ విజయంపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్న శాస్త్రవేత్తలు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఇక ల్యాండర్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపారు. మోడీ తిరిగి ఢిల్లీకి వెళుతుండగా ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. కంటతడి పెట్టిన శివన్‌ను ప్రధాని మోడీ ఓదార్చారు. ఈ దృశ్యం అక్కడి వారితో పాటు వీడియోలో వీక్షించిన వారిని సైతం కదిలించింది. ఈ ప్రతిష్టాత్మక మిషన్‌ను ముందుండి నడిపించిన డాక్టర్ శివన్ గురించే ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటోంది. ఆయన ఎవరు ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటని కొన్ని కోట్లమంది నెటిజెన్లు ఇంటర్నెట్‌లో సెర్చ చేయడంతో ఆయన న్యూస్‌మేకర్స్ 2019లో చోటు సంపాదించారు.

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ శివన్

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ శివన్

డాక్టర్ శివన్... ఇస్రో చీఫ్. ఎంతో సౌమ్యుడు. ఎప్పుడు ముఖంపై చిరునవ్వుతో కనిపించే ఈయన... ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన్ను ప్రధాని మోడీ ఓదారుస్తుండటం చాలా మందిని కదిలించింది. సొంత సోదరుడిని ఓదార్చినట్లుగానే ప్రధాని మోడీ శివన్‌ను ఓదార్చారు. ఇక డాక్టర్ శివన్ ఎవరు.. ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి... ఏ రాష్ట్రానికి చెందినవారు అనే ఆసక్తికర చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇంతకీ శివన్ ఎవరు..? ఇస్రో బాహుబలి మిషన్‌ను ముందుండి నడిపిన డాక్టర్ శివన్ ఒక సాధారణ రైతు బిడ్డ. తన తండ్రితో పాటు పొలాల్లో వ్యవసాయం చేశారు. చిన్నతనంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తన తండ్రి పొలంలో నాట్లు వేశారు. పంటకు నీరుపోశారు.

 వ్యవసాయం చేస్తూ చదువు సాగించిన ఇస్రో చీఫ్

వ్యవసాయం చేస్తూ చదువు సాగించిన ఇస్రో చీఫ్

భారత దేశం దక్షిణ ప్రాంతంలో చివరిదైన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న సరక్కల్‌విలాయ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు కైలాసవడివూ శివన్. ఇక అతని బాల్యంలో చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. బడికి వెళ్లాల్సిన వయస్సులో వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేస్తూనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమిళం మీడియంలో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేశారు. అనంతరం నాగర్‌కోయిల్‌లోని సెయింట్ హిందు కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో మద్రాస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం 1982లో ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.2006లో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబే నుంచి ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

కాలేజీ రోజులు వరకు ధోవతినే ధరించేవారు

కాలేజీ రోజులు వరకు ధోవతినే ధరించేవారు

ఇక తన మొత్తం కుటుంబంలోనే తొలి గ్రాడ్యుయేట్ డాక్టర్ శివన్. శివన్‌కు ఒక సోదరుడు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అయితే పేదరికం వెంటాడటంతో వీరెవరూ పెద్దగా చదువకోలేకపోయారు. కాలేజీలో చదువుతుండగానే తన తండ్రికి పొలంలో సహాయపడేవాడినని చెప్పారు డాక్టర్ శివన్. అందుకే తన ఇంటికి దగ్గరలోని కాలేజీలోనే తనను చేర్పించినట్లు శివన్ గుర్తు చేసుకున్నారు. ఎప్పుడైతే బీఎస్సీ మ్యాథ్స్‌లో 100శాతం మార్కులతో పాసయ్యానో తన తండ్రి శివన్‌ను పై చదువులు చదివించాలని డిసైడ్ అయ్యారట. చిన్నతనంలో చెప్పులు వేసుకుని తిరిగినట్లు తనకు గుర్తు లేదని చెప్పిన శివన్.. కాలేజీ రోజుల వరకు ఒక ధోవతితోనే తిరిగినట్లు గద్గత స్వరంతో చెప్పారు. మద్రాస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి అడుగుపెట్టగానే తొలిసారిగా ట్రవజర్ ధరించినట్లు చెప్పారు.

ఎన్నో ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించిన శివన్

ఎన్నో ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించిన శివన్

ఇక 1982లో ఇస్రోలో చేరినట్లు చెప్పిన శివన్... అప్పటినుంచి జరిగిన ప్రతి రాకెట్ ప్రోగ్రామ్‌లో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇస్రో ఛైర్మెన్‌గా 2018 జనవరిలో శివన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు. అక్కడే రాకెట్ల తయారీ జరుగుతుంది. రాకెట్‌ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే క్రయోజినిక్ ఇంజిన్, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, లాంచ్‌ వెహికల్‌ను తిరిగి వినియోగించేలా డిజైన్ చేయడంలాంటి వెనక శివన్ హస్తం ఉంది. 2017 ఫిబ్రవరి 15న నింగిలోకి ఒకేసారి దూసుకెళ్లిన 104 ఉపగ్రహాల మిషన్‌లో కీలకంగా వ్యవహరించారు డాక్టర్ శివన్. ఈ ప్రయోగం చేసి ఇస్రో ప్రపంచ రికార్డులకెక్కింది.

 ది అదర్ సైడ్ ఆఫ్ రాకెట్ మ్యాన్

ది అదర్ సైడ్ ఆఫ్ రాకెట్ మ్యాన్

రాకెట్ మ్యాన్‌గా పిలువబడే డాక్టర్ శివన్‌కు తమిళంలోని పాత పాటలు వినడమంటే చాలా ఇష్టమట. ఈ పాటలు వింటూ తన పొలంలో పనిచేసేవారట. ఇక 1969లో విడుదలైన రాజేష్ ఖన్నా నటించిన సినిమా ఆరాధన తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని చెప్పారు శివన్. ఇక ప్రకృతిని కూడా చాలా ఇష్టపడుతారు శివన్. తాను విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తిరువనంతపురంలోని తన ఇంట్లో ఒక గులాబీ తోటను పెంచాడని గుర్తు చేసుకున్నారు. అందులో అన్ని రకాల గులాబీ మొక్కలు ఉండేవని చెప్పిన శివన్... బెంగళూరుకు వచ్చాక చాలా బిజీ అయిపోవడంతో వాటిని పెంచేందుకు సమయం దొరకడం లేదని చెప్పారు.

చంద్రయాన్-2 టేకాఫ్ తొలుత జూలై 15న ప్లాన్ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే రంగంలోకి దిగిన డాక్టర్ శివన్ ఆ సమస్యను 24 గంటల్లోనే కనుగొని పరిష్కరించారు. ఆ తర్వాత జూలై 22న తనతో పాటు తన టీమ్ మొత్తం విజయవంతంగా చంద్రయాన్-2ను నింగిలోకి పంపింది. ఈ ఘట్టాన్ని ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీబాత్‌లో ప్రస్తావిస్తూ డాక్టర్ శివన్‌ను అభినందించారు. కేవలం ఏడురోజుల సమయంలోనే తిరిగి చంద్రయాన్‌-2ను నింగిలోకి పంపారని అభినందించారు.

English summary
A humble son of a farmer who studied in local government schools in Tamil medium at Kanyakumari district of Tamil Nadu is now the rocket scientist who headed India's latest moon mission.In a setback earlier today, contact was lost with the moon lander Vikram minutes before it was due to touch down near the lunar south pole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X