వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కేబినెట్‌లోకి అమిత్ షా... ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశముందంటూ ఢిల్లీలో ప్రచారం

|
Google Oneindia TeluguNews

రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ కేబినెట్ ఎలా ఉండబోతోందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు ఎంపీలకు అమిత్ షా నుంచి ఫోన్‌ వెళ్లింది. మోడీ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దంగా ఉండాలంటూ ఆ ఎంపీలకు అమిత్ షా ఫోన్‌లో చెప్పినట్లు సమచారం. అయితే మంత్రుల జాబితాలో అమిత్ షా పేరు కనిపించకపోయినప్పటికీ మోడీ కేబినెట్‌లో ఆయన కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలు చేపడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వేళ అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రిగా వెళితే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

కేబినెట్ మంత్రిగా అమిత్ షా ఎంపికవడంపై ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు గుజరాత్ బీజేపీ చీఫ్ జీతూ వాఘాని ట్వీట్ చేశారు. అప్పటి వరకు జాబితాలో లేని అమిత్ షా పేరు ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అప్పటి నుంచి ఢిల్లీలో ఆర్థికశాఖ మంత్రి బాధ్యతలు అమిత్ షాకు ప్రధాని అప్పజెప్పనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

News making rounds that Amit Shah will hold Finance portfolio?

మోడీ తొలి క్యాబినెట్‌లో అరుణ్ జైట్లీ ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తన అనారోగ్యం కారణంగా తాను ఈ సారి మంత్రిగా కొనసాగలేనని జైట్లీ ప్రధానికి వివరించారు. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు అరుణ్ జైట్లీ. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టలేకపోయారు. ఈ సమయంలో రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ బాధ్యతలను చేపట్టారు. ఆయనే ఓటాన్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఇక ఆర్థికశాఖ మంత్రిగా పీయూష్ గోయల్ పేరు కూడా వినిపిస్తోంది.

English summary
JP President Amit Shah is likely to be the next finance minister, sources said on Thursday. The sources say that JP Nadda will likely to take over as the president of Bharatiya Janata Party.The speculations around BJP President Amit Shah's entry in the Union Cabinet gathered more strength after Gujarat BJP chief Jitu Vaghani tweeted that he met Amit Shah to wish him on his new appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X