వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

News18-IPSOS exit poll: 243 సీట్లతో మహారాష్ట్రలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్, హర్యానా కమలమయం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది. ఆ తర్వాత వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చాయి. అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రెండు రాష్ట్రాల్లోను బీజేపీ కూటమిదే హవా అని, ఆ పార్టీ సునాయాసంగా అధికారం చేజిక్కించుకుంటుందని వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి, హర్యానాలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర బీజేపీ-శివసేనదే, హర్యానాలో కమలం హవాఇండియా టుడే ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర బీజేపీ-శివసేనదే, హర్యానాలో కమలం హవా

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన విజయ విహారం

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన విజయ విహారం

మహారాష్ట్రలో బీజేపీ - శివసేన-మిత్రపక్షాల కూటమి 288 స్థానాలకు గాను ఏకంగా 243 సీట్లు గెలుచుకుంటుందని న్యూస్ 18 - ఐపోసిస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన ఈ పార్టీలు 186 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గతంలో కంటే అరవై వరకు సీట్లు ఎక్కువగా వస్తాయని న్యూస్ 18 - ఐపోసిస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఇప్పుడు కలిసి పోటీ చేసినా గతంలో కంటే సగానికిపైగా సీట్లు కోల్పోనున్నాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.

ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే?

ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే?


బీజేపీ - శివసేన - మిత్రపక్షాల కూటమి 288 సీట్లకు గాను 243 సీట్లు గెలుచుకుంటుంది. బీజేపీకి 141 సీట్లు, శివసేనకు 102 సీట్లు వస్తాయని News18-IPSOS సర్వే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసి బీజేపీ 122 స్థానాలు, శివసేన 63 సీట్లలో గెలిచింది. ఇప్పుడు శివసేనకు 40కి పైగా సీట్లు, బీజేపీకి 20కి పైగా సీట్లు ఎక్కువ రానున్నాయి.

సగానికి పైగా పడిపోనున్న కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు

సగానికి పైగా పడిపోనున్న కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు

కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను కేవలం 41 స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ ఫోల్ పలితాలు వెల్లడించాయి. కాంగ్రెస్ 17, ఎన్సీపీ 22 చోట్ల గెలుచుకుంటుందని తెలిపాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా 42, 41 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తంగా 90 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 41కి పడిపోనుంది.

హర్యానాలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్

హర్యానాలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ ఒంటరిగా 75 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు పరిమితం అవుతుందని News18-IPSOS సర్వే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించాయి. జేజేపీ 2 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించాయి.

ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్

ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్

ఇండియా టుడే - యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వేలో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-మిత్రపక్షాల కూటమి 166-194 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ-మిత్రపక్షాల కూటమి 72-90 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది. ఇతరులు 22-34 సీట్లు గెలుచుకుంటారని తేలింది.

English summary
According to News18-IPSOS exit poll survey, the BJP is likely to win it big in Maharashtra as Ipsos exit poll suggests the Mahayuti alliance of the BJP with Shiv Sena, will win 243 seats. The survey predicts that the BJP will be victorious on 141 seats and Shiv Sena will bag 102 seats. The BJP will be close to a halfway mark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X