వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు ఉద్యోగులను చంపిన వార్తాపత్రిక ఎడిటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

అగర్తాలా: త్రిపురలోని ఓ వార్తాపత్రిక యజమాని ముగ్గురు తన ఉద్యోగులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. తన డ్రైవర్‌ను, ప్రూఫ్ రీడర్‌ను, మేనేజర్‌ను నిరుడు అతను చంపినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో అతన్ని కోర్టు దోషిగా తేల్చింది.

ప్రాంతీయ దినపత్రిక గాందూత్‌కు సుశీల్ చౌధురి (76) సంపాదకుడిగా, యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా నిర్ధారించిన ఆగర్తాలా కోర్టు అతనికి విధించే శిక్షను గురువారంనాడు ఖరారు చేయనుంది.

చౌధురి అక్రమ భూలావాదేవీల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటపెడతానని అతని మేనేజర్ రంజిత్ చౌధురి (61) బెదిరించినట్లు సమాచారం. దాంతో తన డ్రైవర్ బలరాం ఘోష్ సహకారంతో సుశీల్ చౌధురి రంజీత్‌ను హత్య చేశాడు.

Newspaper owner convicted of murdering 3 employees

మేనేజర్‌ హత్యను కళ్లారా చూసిన ప్రూఫ్ రీడర్ సుజిత్ భట్టాచార్జీ (25)ని బలరామ్ ఘోష్ హత్య చేశాడు. తన మరణించడానికి ముందు సుజీత్ బలరాంను పొడిచాడు. దీంతో బలరామ్ మరణించాడు.

ఆ ముగ్గురి శవాలు కూడా సుశీల్ చౌధురి కార్యాలయంలో కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ముగ్గురినీ చంపారని, నిజానికి వారు తనను చంపాలని వచ్చారని సుశీల్ చౌధురి ఓ కట్టుకథ అల్లాడు. హంతకుల ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు ఇస్తానని కూడా ప్రకటించాడు. డ్రైవర్ భార్య నియతి ఘోష్ సహకారంతో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆమె సాక్షి.

English summary
A newspaper owner in Tripura in India's northeast has been convicted of murdering three of his employees - his driver, a proof-reader and manager last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X