వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే 12 రోజులు చాలా కీలకం... కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే... : బీఎంసీ చీఫ్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబై,నాగ్‌పూర్,నాసిక్‌ వంటి ప్రధాన నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అమరావతి,అచల్‌పూర్ పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. తాజాగా బృహన్ ముంబై కార్పోరేషన్(బీఎంసీ) కమిషనర్ ఇక్బాల్ చహర్ ఇదే విషయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 12 రోజులు ముంబై నగరానికి చాలా కీలకమని ఇక్బాల్ పేర్కొన్నారు. కాబట్టి కోవిడ్ 19 నిబంధనలు పాటించనివారి పట్ల బీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. వివాహ వేడుకల్లో కోవిడ్ 19 నిబంధనలు పాటించనివారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని... వధూవరుల తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో మినహాయింపు ఉండదని హెచ్చరించారు.

Next 12 days crucial, well be ruthless on those flouting norms says BMC chief

వివాహ వేడుకలకు దయచేసి 50 కన్నా ఎక్కువమంది హాజరుకావొద్దని రెండు చేతులు జోడించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు తప్పవన్నారు.
కొత్తగా నమోదవుతున్న కేసుల్లో వైరస్ కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముంబైలో లోకల్ రైళ్లు నడుస్తుండటం ఇందుకు ప్రధానంగా కారణంగా చెప్పారు.

ప్రజలు కోవిడ్ 19 నిబంధనలు పాటించకుంటే మహారాష్ట్ర మరోసారి లాక్‌డౌన్‌ను ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే హెచ్చరించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌనే కావాలంటే ఎవరికి నచ్చినట్లు వారు తిరగండి అంటూ ఆయన మండిపడ్డారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే మాత్రం మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే అమరావతి,అకోలా,బుల్దానా,వషీమ్,యావత్‌మల్ జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించవచ్చునన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు.

మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాపై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నిఘా పెట్టిందని తెలిపారు.

English summary
Brihanmumbai Municipal Corporation (BMC) commissioner Iqbal Chahar told India Today TV that the next 12 days are crucial for Mumbai in view of the rising Covid-19 cases in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X