• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాబోయే 125 రోజులు జాగ్రత్త: మోదీ సర్కార్ హెచ్చరిక -దేశంలో కరోనా 3వ వేవ్ మొదలైందా?

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉధృతి పూర్తిగా తగ్గకముందే మూడో వేవ్ తలెత్తిందనే అంచనాల నడుమ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 100 నుంచి 125 రోజులపాటు దేశ ప్రజలంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. వీకెండ్ ప్రెస్ మీట్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

పారిపోడానికి సిద్ధంగా కేసీఆర్ బినామీలు -భారీ కుంభకోణం -ఐజీ ప్రభాకర్‌ పైనా -రేవంత్ రెడ్డి తాజా బాంబుపారిపోడానికి సిద్ధంగా కేసీఆర్ బినామీలు -భారీ కుంభకోణం -ఐజీ ప్రభాకర్‌ పైనా -రేవంత్ రెడ్డి తాజా బాంబు

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందా లేదా అన్నది తెలుసుకునేందుకు రానున్న 100-125 రోజులు చాలా కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచమంతా కరోనా థర్డ్‌ వేవ్‌ వైపు మల్లుతున్నదని, కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గురువారం చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదని ఆయన చెప్పారు.

Next 125 days critical in fight against covid-19, centre warns amid corona 3rd wave in India

కరోనా థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌ వేవ్‌ అన్నది ముఖ్యం కాదని వైరస్‌ వ్యాప్తి తీవ్రత ముఖ్యమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా పరిస్థితిని మనం ఎలా నిర్వహించగలుగుతున్నాం అన్న దానిపై వేవ్స్‌ ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో మాస్కులను ధరించడంపట్ల ప్రజలు నిర్లక్షం వహించడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ రేటు పది శాతానికిపైగా ఉన్నదని ఆయన వెల్లడించారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోదీ ఆదేశించారని నీతి ఆయోగ్‌ (హెల్త్) సభ్యుడు డాక్టర్‌ వీకే పౌల్‌ అన్నారు. మన జనాభాకు ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, సహజ హెర్డ్‌ ఇమ్యూనిటీకి మనం ఇంకా చేరలేదని చెప్పారు. అందుకే నిరంతర వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే,

మోదీ సార్.. చాలా థ్యాంక్స్, ఏపీకి గొప్ప సహాయం చేస్తున్నారు: సీఎం జగన్ -కరోనా కట్టడి, వ్యాక్సిన్లపై -videoమోదీ సార్.. చాలా థ్యాంక్స్, ఏపీకి గొప్ప సహాయం చేస్తున్నారు: సీఎం జగన్ -కరోనా కట్టడి, వ్యాక్సిన్లపై -video

మూడో వేవ్ అనుమానాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కేసులు అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. కఠిన నిబంధనలు అమలు చేసి మూడో దశ రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 'టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సిన్‌' విధానాన్ని మరింత విస్తరింపజేయాలని తెలిపారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కొత్త కేసులు, మరణాల్లో దాదాపు 80శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు తెలిపాయి.

English summary
India is yet to achieve herd immunity against Covid-19 and possibilities of new outbreaks of the viral infection cannot be ruled out, the central government said on Friday. It added that in order to contain the disease, the next 125 days would be very critical. Addressing a health ministry briefing, Niti Aayog Member (health) Dr VK Paul said we need to stop the infection from transmitting now and this is possible by adopting Covid-appropriate behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X