వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రానున్న రెండు నెలలే ఆర్థిక వ్యవస్థకు కీలకం: ఎస్బీఐ చీఫ్ రజనీష్

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమైనవని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) చీఫ్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక మందగమనం ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు.

పాకిస్థాన్: కిడ్నాప్, మతం మార్చి పెళ్లి: ఎట్టకేలకు క్షేమంగా ఇల్లు చేరిన సిక్కు యువతిపాకిస్థాన్: కిడ్నాప్, మతం మార్చి పెళ్లి: ఎట్టకేలకు క్షేమంగా ఇల్లు చేరిన సిక్కు యువతి

బ్యాంకులను ఏకీకృతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని రజనీష్ కుమార్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల మాట్లాడుతూ.. బ్యాంకుల విలీనం ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, బ్యాంకుల విలీనం వల్ల ఆటోమొబైల్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. కియా మోటార్స్ మంచి గణాంకాలను సాధించిందని ఎస్బీఐ వార్షిక బ్యాంకింగ్ కాన్‌క్లే‌వ్‌కి ముందుగా ఎకనామిక్స్ టైమ్స్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

Next 2 months crucial for economy: SBI chief

పర్యావరణ సమస్యలు, పబ్లిక్ మైండ్‌సెట్ మారడం కూడా దీనిక కారణంగా నిలుస్తోందని అన్నారు. ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. వచ్చే అక్టోబర్, నవంబర్ రెండు నెలలు కూడా ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని సీస్బీఐ చీఫ్ రజనీష్ కుమార్ స్పష్టం చేవారు.

వచ్చే రెండు నెలల్లో కూడా పండగలు ఉన్నందున ప్రజలు కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగుపడుతుందని అన్నారు. జూన్ క్వార్టర్‌లో భారత వృద్ధిరేటు 5శాతంగా ఉంది. ఇది ఆరేళ్ల కనిష్టం కావడం గమనార్హం. ఆటో మొబైల్ రంగంలో కొనుగోళ్లు పడిపోవడంతో ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
The next two months are crucial for the Indian economy that’s facing its worst slowdown in six years amid debate about whether the downturn is cyclical or structural as the key automobile industry faces headwinds, said State Bank of India chairman Rajnish Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X