వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తదుపరి దశ వ్యాక్సినేషన్‌లో 60ఏళ్లు పైబడినవారికే ప్రాధాన్యత: అందరికీ ఉచితం కాదు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనదేశంలో మొదటి దశలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందికి టీకాలను వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాతి దశలో 50 ఏళ్లు, ఆ పైబడినవారికి టీకాలను ఎప్పట్నుంచి పంపిణీ చేయాలనేదానిపై ప్రభుత్వ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి.

Recommended Video

Covid-19 Variant N440K Spreading More In Southern States || Oneindia Telugu

 ఏపీలో కొత్తగా 88 కరోనా కేసులు: జిల్లాలవారీగా, స్వల్పంగా పెరిగిన యాక్టివ్ కేసులు ఏపీలో కొత్తగా 88 కరోనా కేసులు: జిల్లాలవారీగా, స్వల్పంగా పెరిగిన యాక్టివ్ కేసులు

60 ఏళ్లు పైబడినవారికే మొదటి ప్రాధాన్యత

60 ఏళ్లు పైబడినవారికే మొదటి ప్రాధాన్యత

50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో కొందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితం కాగా, మరికొందరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు గ్రూపులవారు సుమారు 27 కోట్ల మంది ఉంటారని అంచనావేసింది. 60 ఏళ్లు పైబడినవారికి మార్చి నుంచి ప్రారంభమయ్యే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితం కాదు..

కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితం కాదు..

రెండో దశలో వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు ఓటరు జాబితాను ఆధారంగా చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే వారికి వ్యాక్సిన్ ఉచితమా? లేక కొనుగోలు చేయాలా? అనేది తెలియజేయడం జరుగుతుందని వెల్లడించాయి. ఎవరు ఉచితంగా వ్యాక్సిన్ పొందుతారు.. ఎవరు వ్యాక్సిన్ కొనుగోలు చేయాలనేదానిపై త్వరలోనే స్పష్టతనిస్తామని, వారితో సమాచారం పంచుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మార్చి మొదటివారంలో తదుపరి దశ వ్యాక్సినేషన్

మార్చి మొదటివారంలో తదుపరి దశ వ్యాక్సినేషన్


జనవరి 16న ప్రారంభమైన తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి వ్యాక్సినేషన్ కార్యక్రమం మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. 50 ఏళ్లు, ఆపైబడినవారికి ప్రాధాన్యత ఉంటుంది. వీరిలో తొలి ప్రాధాన్యత 60ఏళ్లు పైబడినవారికే. వారే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
ఓటరు జాబితా, ఆధార్ కార్డు సమాచారం మేరకు లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందని చెప్పారు.

కో-విన్ యాప్‌లో రిజిస్టర్ నమోదు చేసుకుంటే..

కో-విన్ యాప్‌లో రిజిస్టర్ నమోదు చేసుకుంటే..

కో-విన్ యాప్‌లో లబ్ధిదారులు తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా, ఆధార్‌ల నుంచి ఈ సమాచారాన్ని సరిచూసుకోవడం జరుగుతుంది. ఈ పక్రియ పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్ కేంద్రాలు, జియో-కోఆర్డినేట్స్ ను కో-విన్ యాప్ డిస్‌ప్లే చేస్తుంది. దీంతో లబ్ధిదారుడు తేదీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండోదశలో ఇదే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. దేశంలో ఒక్కరోజులో 60కిపైగా కన్‌సైనీ పాయింట్లు వ్యాక్సిన్లను డెలివరీ చేస్తాయి. కన్‌సైనీ సెంటర్లకు, వ్యాక్సినేషన్ కేంద్రాలకు మధ్య దూరం 60-70 కిలోమీటర్ల మధ్యలోనే ఉండేలా చూసుకుంటున్నారు. వారంలో నాలుగురోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి, వ్యాక్సినేషన్ ను మరింత పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖలు రాశారు.

English summary
Next phase of vaccination: 60-plus first, free shots not for all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X