వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌పై భేటీకి ఆర్థిక మంత్రిని పిలవలేదా? ఎకనమిస్టులతో ప్రధాని మోదీ మీటింగ్‌పై కాంగ్రెస్ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

జీడీపీ రేటు తగ్గుదల, ఆర్థిక మందగమనం తదితర ఇబ్బందుల నేపథ్యంలో వచ్చే నెలలో(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ పై కేంద్ర తీవ్ర కసరత్తు చేస్తోంది. బడ్జెట్ తయారీలో ముఖ్యమైన సలహాలు, సూచనల కోసం ప్రముఖ ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 'ప్రీ బడ్జెట్' మీటింగ్ ను నిర్వహించారు. అయితే ఈ భేటీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకాకపోవడాన్ని విపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.

ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో జరిగిన ప్రీ బడ్జెట్ మీటింగ్ కు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నితిన్ గడ్కరీ, నరేంద్ర సింగ్ తోమర్ హాజరయ్యారు. మీటింగ్ కుసంబంధించిన ఫొటోను ట్వీట్ చేస్తూ''ఆర్థిక మంత్రి ఎక్కడున్నారు?''అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ''కనీసం తర్వాతి సమావేశానికైనా నిర్మల గారిని పిలవండి. ఎంత మంది మగవాళ్లు కష్టపడితే మాత్రం ఆడవాళ్ల సత్తాకు సరిసమానమవుతుంది?''అంటూ సెటైర్లు వేసింది.

Next time invite FM: Cong mocks PMs budget meet

ఫైనాన్స్ మినిస్ట్రీ వివరణ..
కాంగ్రెస్ ట్వీట్లకు స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన ప్రీబడ్జెట్ భేటీకి నిర్మల రాకపోవడానికి గల కారణాలను వివరించింది. సమావేశానికి వచ్చిన ఆర్థిక వేత్తలతో మంత్రి ముందే భేటీ అయ్యారని, ప్రధాని మీటింగ్ జరుగుతున్న టైమ్ లో కూడా నిర్మల బడ్జెట్ సంబంధిత పనుల్లోనే బిజీగా ఉన్నారని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది.

English summary
The Congress on Thursday took a swipe at Finance Minister Nirmala Sitharaman over her absence at a pre-budget meeting with economists and experts at the Niti Aayog in New Delhi which was chaired by Prime Minister Narendra Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X