వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 నెలల చిన్నారికి అనారోగ్యం, చిన్నారి తండ్రి ట్వీట్, సర్జరీ చేయిస్తా.. సోనూసూద్ ధైర్యం..

|
Google Oneindia TeluguNews

ఎవరికీ ఏ ఆపద వచ్చినా సరే.. ఇప్పుడు సమస్యను సోనూ సూద్‌కు విన్నవిస్తున్నారు. నేను ఫలానా.. నా కూతురు/ కుమారుడికి ఈ సమస్య ఉంది చెబుతున్నారు. దీంతో సోనూ సూద్ స్పందించి ఆపరేషన్ చేయిస్తానని రియాక్టవుతున్నారు. గత నెల 30వ తేదీన ఓ చిన్నారి తండ్రి ట్వీట్ చేయగా.. సోనూ సూద్ స్పందించారు. అండగా ఉన్నానని.. ఆపరేషన్ చేయిస్తానని భరోసానిచ్చారు. ఇలా తనకు తోచిన సాయం చేసుకుంటు ముందుకుసాగుతున్నారు సోనూసూద్.

Recommended Video

Sonu Sood : నిస్సహాయ తండ్రి ట్వీట్ కి చలించిపోయిన సోనూసూద్... 4 నెలల చిన్నారికి సర్జరీ ! || Oneindia

చిన్నారికి అనారోగ్యం

మహ్మద్ ఆసిఫ్ రాజా అనే వ్యక్తికి ఇటీవలే పాప జన్మించింది. అయితే ఆమె అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు చేయించారు. పాప గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ఆపరేషన్ చేయించే స్థోమత అతనికి లేదు. చేసేదేమీ లేక.. గత నెల 30వ తేదీన సోనూ సూద్‌కు ట్వీట్ చేశారు. తన సమస్యను విన్నవించారు. తనకు దయచేసి సాయం చేయాలని కోరారు. ఇందుకు సోనూ సూద్ మంగళవారం స్పందించారు.

వచ్చేవారం సర్జరీ

వచ్చేవారం సర్జరీ

వచ్చేవారం ముంబైలో చిన్నారికి శస్త్రచికిత్స చేయిస్తామని సోనూ సూద్ తెలిపారు. దీంతో చిన్నారి ఆరోగ్యం మెరుగవుతోందని తెలిపారు. తన టీమ్ మెంబర్స్ మీతో సంప్రదింపులు జరిపి. ముంబై తీసుకొస్తారని తెలిపారు. భయపడొద్దు నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చారు. సోనూ సూద్ రియాక్షన్‌తో ఆసిఫ్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. థాంక్స్ అంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది.

చిత్తూరు రైతుకు ట్రాక్టర్

చిత్తూరు రైతుకు ట్రాక్టర్

లాక్ డౌన్ వల్ల కూలీల వెతలతో బయటకొచ్చిన సోనూ సూద్ మంచి మనసు.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరా, ఇద్దరా, పలువురికి ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. బతుకుదెరువు కోసం మదనపల్లెలో టీ స్టాల్ నాగేశ్వరరావు లాక్ డౌన్ వల్ల గ్రామానికి వచ్చారు. అయితే తన కూతుళ్లతో దున్నడం, ఆ ఫోటోలు సోనూసూద్ చూశారు. దీంతో వెంటనే సోనాలికా ట్రాక్టర్ పంపించేశారు. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధి లేకుండా పో యింది.

 సాప్ట్ వేర్ శారదకు జాబ్ ఆఫర్

సాప్ట్ వేర్ శారదకు జాబ్ ఆఫర్

కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ మార్కెట్ కుదేలైపోయింది. సంస్థలు/ పరిశ్రమలకు కూడా సరైన పని లేకపోవడంతో తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అలా వరంగల్‌కి చెందిన శారద.. సాప్ట్ వేర్ ఇంజినీర్ కానీ, ఉద్యోగం కోల్పోయింది. కూరగాయాలు అమ్ముతూ తన ఇంటిని గడుపుతోంది. ఇంకేముంది కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తోన్న టెకీ అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరలైంది. ఈ విషయం తెలుసుకొని సోనూసూద్ స్పందించారు. శారదకు జాబ్ ఆఫర్ చేశారు. కానీ ఆమె తిరస్కరించారు.

English summary
sonu sood: next week surgery in mumbai hospital for four months child.. sonu sood told to her parent asif.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X