వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్: రూ. 40 కోసం రూ. 33 వేలు లాయర్ ఫీజు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేవలం 40 రూపాయల కోసం అధికారులు వాదనలు వినిపించడానికి లాయర్ ఖర్చుల కింద రూ. 33 వేలు బూడిదలో పోశారు. విషయం తెలుసుకున్న పై అధికారులు ఆ ఉద్యోగిపై మండిపడి ఖర్చు అయిన మొత్తం డబ్బు వసూలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆర్ కే. జైన్ అనే ఆయన ఆర్ టీఐ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎన్ని దరఖాస్తులు దాఖలు అయ్యాయి, వాటిలో ఎన్ని పరిష్కరించాలో తెలపాలంటూ దరఖాస్తు ఇచ్చారు.

పఫ్ట్ అప్పిటేల్ అథారిటీ ఆదేశాలను లెక్కచెయ్యకుండా 20 పేజీల సమాచారం ఇవ్వడానికి రూ. 40 చెల్లించాలని అక్కడ పని చేస్తున్న సీపీఐవో చేతన్ చావ్లా ఆర్ కే సింగ్ మీద ఒత్తిడి తెచ్చాడు. ఆర్ కే సింగ్ సమాచార కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

NGT spends Rs.33,000 as litigation fee to save Rs. 40 in New Delhi

సమాచార కమిషన్ లో తమ వాదన వినిపించడానికి ఎన్ జీటీ అధికారులు సిద్దం అయ్యారు. ప్రత్యేకంగా ఓ లాయర్ ను పెట్టారు. సమాచార కమిషన్ లో వాదనలు పూర్తి అయ్యాయి. ఎన్ జీటీ అధికారులు లాయర్ కు ఫీజు కింద రూ. 33 వేలు చెల్లించారు.

కేవలం రూ. 40 కోసం రూ. 33 వేలు దుబారా చేశారని తెలుసుకున్న సమాచారకమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆ కేసులో దుబారా చేసిన అధికారి నుంచి రూ. 33 వేలు వసూలు చెయ్యాలని ఎన్ జీటీ చైర్మన్ కు ఆదేశాలు జారీ చేశారు.

English summary
The National Green Tribunal (NGT) apparently paid over Rs. 33,000 as litigation fee to contest its demand of Rs. 40 for the discnlosure of information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X