బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూర్‌లో ఉగ్రవాదుల బాంబుల తాయారీ యూనిట్‌... ఉగ్రవాదులపాటు ఐఈడీ బాంబుల స్వాధీనం

|
Google Oneindia TeluguNews

ఓ వైపు కర్ణాటకలో రాజకీయాలు వెడెక్కుతుంటే మరోవైపు ఉగ్రవాదులు తమ కార్యకర్యాలపాలను ముమ్మరం చేశారు. బెంగళూర్ నగరంలో బాంబుల తాయారీ యూనిట్‌‌ను సీజ్ చేయడంతోపాటు ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన స్థలంలో ఒక ఐఈడీ బాంబుతోపాటు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2014లో పశ్చిమబెంగాల్‌లోని బురుద్వాన్ బాంబ్ పేలుళ్లలో పట్టుకున్న ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఎన్ఐఏ పోలీసులు బాంబులు తాయారు చేసే యూనిట్ పై దాడి చేశారు. అనంతరం ఐఈడీ బాంబులతోపాటు పలు గ్రెనెడ్‌లను స్వాధినం చేసుకున్నారు. కాగా సంఘటన స్థలంలో ఉన్న ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులను సైతం అరెస్ట్ చేశారు. కాగా బురుద్వాన్‌ బాంబు పేలుళ్లలో హబీబుర్ రహ్మాన్‌ను జనవరి 2019న ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. దీంతో రహ్మాన్ నుండీ కీలక సమాచారం సేకరించిన ఎన్ఐఏ పోలీసులు బెంగళూర్ బాంబు ఫ్యాక్టరీ పై దాడి చేశారు.

NIA busted a bomb manufacturing unit in Bengaluru

కాగా సంఘటన స్థలం నుండి ఒక ఐఈడీ బాంబుతో పాటు 5 హ్యాండ్ గ్రెనెడ్స్, ఒక టైమర్, పలు పేలుడు పదార్థాలు కూడ స్వాధీనం చేసుకున్నారు. బురుద్వాన్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు పౌరులు చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు.

English summary
The National Investigation Agency (NIA) on Tuesday busted a bomb manufacturing unit in Bengaluru, Karnataka and recovered grenades and an Improvised Explosive Device (IED) from the location.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X