వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ సానుభూతిప‌రుల కోసం జ‌ల్లెడ‌: ఉలిక్కిప‌డ్డ జ‌నం!

|
Google Oneindia TeluguNews

కోయంబ‌త్తూర్‌: త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో ఉగ్ర‌వాద క‌ద‌లిక‌ల‌తో ఉలిక్కిప‌డుతోంది. భ‌యాన‌క ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ సానుభూతిప‌రులు తిష్ట వేశారంటూ ప‌క్కా స‌మాచారం అంద‌డంతో ఏకంగా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) రంగంలోకి దిగింది. కోయంబ‌త్తూర్ న‌గ‌రాన్ని జ‌ల్లెడ ప‌డుతోంది. నిద్ర లేస్తూనే భ‌యాన‌క వార్త‌ను విన‌డంతో కోయంబ‌త్తూర్ వాసులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అధికారులు ఈ తెల్ల‌వారు జామున 5 గంట‌ల‌కు కోయంబ‌త్తూర్‌కు చేరుకున్నారు. ఆ వెంట‌నే- త‌మ‌కు అందిన స‌మాచారానికి అనుగుణంగా అనుమానిత ప్ర‌దేశాల్లో అన్వేష‌ణ మొద‌లు పెట్టారు. కోయంబ‌త్తూర్‌లోని ప‌లు ప్రాంతాల్లో గాలింపు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. అన్బున‌గ‌ర్‌, ఉక్క‌డం, కునియ‌ముత్తూర్‌, పోత‌నూర్ ప్రాంతాల్లో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. స్థానికుల నుంచి అభ్యంత‌రాలు తలెత్తే అవ‌కాశాలు లేకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా సెర్చ్ వారెంట్ల‌ను కూడా వెంట తెచ్చుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

 NIA conducts searches across Coimbatore over suspected terror links

ఐసిస్ సానుభూతిప‌రులు త‌ల‌దాచుకున్న‌ట్లు త‌మ‌కు ప‌క్కా స‌మాచారం ఉంద‌ని పేర్కొన్నారు. ఈస్ట‌ర్ సండే సంద‌ర్భంగా రాజ‌ధాని కొలంబో స‌హా శ్రీలంక‌లోని ప‌లు న‌గ‌రాల్లో చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడులకు, తాజాగా తాము చేప‌ట్టిన గాలింపు చ‌ర్య‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఇదివ‌ర‌కు తాము కొంత‌మంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకోగా.. ఐసిస్ సానుభూతిప‌రులు కోయంబ‌త్తూర్‌లో త‌ల‌దాచుకున్న‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము అన్వేష‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

 NIA conducts searches across Coimbatore over suspected terror links

శ్రీలంక‌లో ఆత్మాహూతి ద‌ళ స‌భ్యులు న‌ర‌మేథాన్ని సాగించిన అనంత‌రం వారు ఉగ్ర‌వాదులు భార‌త్‌కు చేరుకుని ఉండొచ్చంటూ వార్త‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. స‌ముద్ర మార్గం గుండా వారు త‌మిళ‌నాడులోని తీర ప్రాంత జిల్లాలైన రామ‌నాథ‌పురం, క‌డ‌లూర్‌, నాగ‌పట్టిణం స‌హా సేలం, ఈరోడ్ వంటి జిల్లాల్లో త‌ల‌దాచుకుని ఉంటార‌నే అనుమానాలు వ‌చ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్ప‌ట్లో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అధికారులు ఆయా జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

English summary
The National Investigation Agency has been conducting searches in atleast 10 locations across Coimbatore from 5.30 am on Wednesday. The searches, according to NIA sources, are at the residences of youths suspected to be in contact with members of the Islamic State (IS). "We have multiple search warrants and are raiding residences of men who are suspected to be organising groups to join the ISIS or are in touch with terror groups and are planning to join them," says an NIA source. On reports that the searches are connected to Sri Lanka, he says, "No, that is not the case. This is in continuation to searches we have been conducting in Kochi in Kerala."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X