చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడులో ఐఎస్ కదలికలు : పది చోట్ల ఎన్ఐఏ ముమ్మర సోదాలు

|
Google Oneindia TeluguNews

చెన్నై : తమిళనాడులో ఐఎస్ ఉగ్రవాదుల అలజడి కలకలం రేపుతుంది. రాష్ట్రంలోని 10 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. 8 మంది ఐఎస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. మూడు జిల్లాలకు చెందిన వారిపై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు.

దాడిచేసే యత్నం
ఐఎస్ సానుభూతిపరులంతా దేశంలో అలజడి సృష్టించేందుకు వ్యుహరచన చేశారని పేర్కొన్నారు. పేలుళ్లకు పాల్పడి .. దేశంలోని జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేసే ప్రయత్నాలు చేశారని తమకు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. దీంతో రామంతపురం, సేలం, చిదంబరంలోని షేక్ దావూద్, మహ్మద్ రియాజ్, సాధిక్, ముబారిస్ అహ్మద్, రిజ్వాన్, హమీద్, అక్బర్ ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాము జారీచేసిన సమన్లపై వివరణ ఇవ్వలేరని పేర్కొన్నారు.

NIA raids 10 places in Tamil Nadu over suspected Islamic State links

ముమ్మర తనిఖీలు
అనుమానితులు 8 మంది ఇళ్లను తనిఖీ చేసే కొద్దిరోజుల ముందు .. తమిళనాడులోని పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా కార్యాలయం, మూడు ప్రాంతాల్లో ఉన్న తౌషీద్ జమాతే ఆఫీసులను కూడా విసృతంగా సోదాలు నిర్వహించారు. ఇటీవల శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు జరిగిన నరమేధంతో వీరికి ఏమైనా సంబంధం ఉన్నదా అనే కోణంలో రైడ్స్ నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసే తౌషీద్ జమాతే వద్ద సంస్థలో తమిళనాడులో ఓ స్లీపర్ సెల్ రిజాయ్ అబూబకర్ ఉన్నారనే సమాచారంతో రాష్ట్రంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆధారాలు ఒక్కొటి వెలుగుచూసింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లా ముత్తలమడకు చెందిన రియాజ్ .. శ్రీలంకలో బాంబు దాడికి పాల్పడ్డ జహ్రన్ హసీం, జకీర్ నాయక్‌తో కలిపి మానవబాంబుగా మారేందుకు ప్రయత్నించారని తమ వద్ద సమాచారం ఉందని ఎన్ఐఏ వర్గాలు చెప్తున్నాయి.

English summary
the National Investigations Agency (NIA) on Monday carried out raids at 10 places in Tamil Nadu in connection with a case filed against eight people for allegedly supporting Islamic State (IS). The case, registered on January 8, was filed against eight suspects from three districts under eight sections. The accused were allegedly conspiring against India by supporting the IS and planning to get jihadis lodged in Indian prisons released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X