బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో పీజీల్లో ఉగ్రవాదులు మకాం ?, సోదాలు చేసిన ఎన్ఐఏ, విద్యార్థుల ముసుగులో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని పీజీల్లో (పేయింగ్ గెస్ట్) ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాదులు విద్యార్థుల ముసుగులో బెంగళూరు పీజీల్లో మకాం వేశారని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది.

సిటీ బస్ స్టాప్ లో బ్లూ ఫిలిం, పండగ చేసుకున్న ప్రయాణికులు, ఏం పోయే కాలం, కాలేజ్ అమ్మాయిలు !సిటీ బస్ స్టాప్ లో బ్లూ ఫిలిం, పండగ చేసుకున్న ప్రయాణికులు, ఏం పోయే కాలం, కాలేజ్ అమ్మాయిలు !

బెంగళూరు నగరంలోని సోలదేవనహళ్ళిలోని పీజీల్లో శుక్రవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి అక్కడ బస చేసిన వారిని విచారణ చేసి వివరాలు సేకరించారు. బాంగ్లాదేశ్ కు చెందిన అన్సరుల్లా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు బెంగళూరు వచ్చారని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

NIA team searched the paying guest in Soladevanahalli Bengaluru

పశ్చిమ బెంగాల్ ఎన్ఐఏ అధికారులు మేఘాలయాలో ఫర్హాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బెంగళూరులోని పీజీల్లో ఇద్దరు బాంగ్లాదేశ్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని, వారు విద్యార్థుల ముసుగులో అక్కడ మకాం వేశారని ఫర్హాన్ సమాచారం ఇచ్చాడని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

గతంలో బెంగళూరు నగరంలో బాంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జమాత్ ఉల్ ముజాహుద్దీన్ (జేఎంబీ) ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంలో వారి కార్యకలాపాలు విస్తరించడానికి బెంగళూరు కేంద్రంగా చేసుకున్నారని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఇంతకు ముందు బెంగళూరు, రామనగరలో ఎన్ఐఏ అధికారులు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Bengaluru: A National Investigation Agency (NIA) team searched the paying guest in Soladevanahalli in Bengaluru in alleged Bangladeshi terrorist stay in city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X