వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్.. ఇంకా ఎన్ని ఆప్షన్లున్నాయో తెలుసా?

|
Google Oneindia TeluguNews

కదులుతున్న బస్సులో ఒకడి తర్వాత ఇంకొకడు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపారు.. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికీ వాళ్లు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.. ఒకడి తర్వాత ఇంకొకడు పిటిషన్లు దాఖలు చేస్తూ.. చావును నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు.. నలుగురు నిందితుల్లో ఒకడైన వినయ్ వర్మ బుధవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ న్యాయ తతంగం ఇంకా ఎన్నాళ్లు పడుతుందో.. ఆ కీచకులకు ఇంకా ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో తెలుసా?

ఉద్రేకంలో ఇచ్చిన తీర్పు..

ఉద్రేకంలో ఇచ్చిన తీర్పు..

వినయ్ శర్మ బుధవారం రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ లో పలు సంచలన అంశాలు పేర్కొన్నాడు. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలను, నిరసనలు చేశాయని, అలాంటి పానిక్ వాతావరణంలో మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు ముమ్మాటికీ ఉద్రేకపూరితమైనదిగానే భావించాలని, ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చిర్చి తనకు న్యాయం చేయాలని వినయ్ వేడుకున్నాడు.

ఫిబ్రవరి 1పై టెన్షన్

ఫిబ్రవరి 1పై టెన్షన్

ట్రయల్ కోర్టు తీర్పు ప్రకారం నిర్భయ కేసులో నలుగురు దోషులకు జనవరి 24నే ఉరిశిక్ష అమలు కావాల్సిఉన్నా.. తీర్పును సవాలు చేస్తూ ముఖేశ్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. ఆ తర్వాత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో మరణశిక్ష అమలు ఫిబ్రవరి1కి వాయిదా పండింది. నలుగురినీ ఒకేసారి ఉరి తీసి చంపాలి కాబట్టి.. ఆమేరకు తీహార్ జైలులో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో మూడ్రోజుల్లో ఉరి తీస్తారనగా.. వినయ్ శర్మ సడెన్ గా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో శనివారం శిక్షలు అమలవుతాయా? లేదా? అనే టెన్షన్ నెలకొంది.

ఇంకా చాలా ఆప్షన్లున్నాయి..

ఇంకా చాలా ఆప్షన్లున్నాయి..

నిరపరాధుల రక్షణ కోసం చట్టంలో ఉన్న నిబంధనల్ని.. నిర్భయ దోషులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తద్వారా ఉరిశిక్ష అమలు నిలిపివేతకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్లలో లేపేసినట్లు కాకుండా చట్టబద్ధంగా చంపేసే ప్రక్రియ కాబట్టి.. నిర్భయ దోషులకు కూడా అన్ని న్యాయసూత్రాలు వర్తింపజేయాల్సిఉంటుంది. శిక్ష అమలును వాయిదా వేసేందుకు ఇవాళ్టికి కూడా వాళ్ల దగ్గర చాలా ఆప్షన్లున్నాయి. దోషుల పేర్ల వారిగా అవేటో ఒకసారి పరిశీలిస్తే..

వినయ్ కుమార్ శర్మ(26 ఏళ్లు)..

వినయ్ కుమార్ శర్మ(26 ఏళ్లు)..


బుధవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరిస్తే.. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసుకోవచ్చు. కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇదివరకే కొట్టేసింది.

పవన్ గుప్తా(25)

పవన్ గుప్తా(25)

ఉరిశిక్ష తీర్పుపై ఇతనింకా సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయలేదు. అది కొట్టేసిన పక్షంలో రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వీలుంది. రాష్ట్రపతి నో చెబితే మళ్లీ సుప్రీంను ఆశ్రయించే సౌకర్యం కూడా ఉంది.

అక్షయ్ కుమార్ సింగ్(31)

అక్షయ్ కుమార్ సింగ్(31)


వినయ్ క్షమాభిక్ష కోరిన బుధవారం నాడే అక్షయ్ సింగ్ కూడా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అది కొట్టుడుపోతే రాష్ట్రపతి దగ్గరికి.. ఆయనా నో చెబితే.. మల్లీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లే అవకాశాలున్నాయి.

ముఖేష్ కుమార్ సింగ్(32)

ముఖేష్ కుమార్ సింగ్(32)

నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఇప్పటికిప్పుడు ఉరితీయగలిగింది ముఖేశ్ సింగ్ ఒక్కడినే. వాడికున్న లీగల్ ఆప్షన్లు అన్నీ చేజారి పోయాయి. అయితే నలుగురినీ కలిపే ఉరితీయాలన్నది తీర్పు కాబట్టి.. ముఖేశ్ ను విడిగా చంపేసే అవకాశంలేదు. అందరి పిటిషన్లు, అన్ని ఆప్షన్లు పూర్తయిన తర్వాతే శిక్ష అమలుకు మార్గం సుగమమం అవుతుంది. ఈలోపు కోర్టులు ఏదైనా రూలింగ్ ఇస్తేతప్ప 11న ఉరి యధావిధిగా అమలుకాదు.

English summary
Nirbhaya rape case convict Vinay Kumar Sharma on Wednesday filed a mercy petition for the commutation of his capital punishment to a life sentence to President Ram Nath Kovind. Here's the status of legal appeals by Nirbhaya case convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X