• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా కల్లోలం: అసోంలో రాత్రి కర్ఫ్యూ విధింపు.. నేటి నుంచి అమలు

|
Google Oneindia TeluguNews

కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. అసోంలో కరోనా కేసులు పెరగడంతో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నైట్‌కర్ఫ్యూ విధించింది. అన్ని జిల్లాల్లోను కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులకు ఆదేశించింది. ఈ రోజు రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.

10 రోజుల్లో.. ఇలా

10 రోజుల్లో.. ఇలా

గత 7 నుంచి 10 రోజుల్లో కరోనా కేసులు గతం కంటే ఎక్కువగా నమోదుకావటంతో ప్రభుత్వం వెంటనే అలర్టయ్యింది. కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, షోరూంలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మూసివేయాలని సర్కారు ఆదేశించింది. అయితే అత్యవసర సేవలు 24 గంటలు కొనసాగుతాయని చెప్పింది.

వ్యాక్సినేషన్..

వ్యాక్సినేషన్..

ప్రయాణికులు వ్యాక్సిన్ వేయించుకోవడంతోపాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, హయ్యర్‌ సెకండరీ, నర్సింగ్‌ కోర్సులు, టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో ఫిజికల్‌ క్లాస్‌లకు హాజరయ్యేందుకు సింగిల్‌ డోసు టీకా వేసుకున్న విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీని కోసం విద్యార్థులు, టీచింగ్ రంగంలో ఉన్నవారు, సిబ్బందికి మూడు రోజుల ముందుగానే వ్యాక్సిన్‌ వేయనున్నట్లు చెప్పింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సినిమా థియేటర్లు మూసిసే ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలు 24 గంటలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.

రాత్రి 8 గంటలకే క్లోజ్

రాత్రి 8 గంటలకే క్లోజ్

ఆఫీసులు, వాణిజ్య సంస్థలు, వ్యాపారాలు రాత్రి 8 గంటలకు మించి తెరిచి ఉంచరాదని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు వంటి తినుబండారాల వ్యాపారాలు కూడా రాత్రి 8 గంటలకు మూసివేయాలని కోరారు. ఆయా వ్యాపార ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా గుమిగూడ కుండా ఉండే చూసుకునే బాధ్యత వారిదేనని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. మంగళవారం అసోంలో 570 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించగా.. ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,426కు పెరిగింది.

ఎఫెక్ట్

ఎఫెక్ట్

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

టీకాలు

టీకాలు


వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

English summary
coronavirus alert:night curfew imposed at assam state. today onwards curfew is continued
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X