వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా జాగ్రత్తలు ,అధిక టెస్టులు లేకుండా నైట్ కర్ఫ్యూలు వ్యర్థం : వైద్య నిపుణుల అభిప్రాయం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది . పండుగ సీజన్ ముగిసినప్పటి నుండి, కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న ధోరణి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లలో ఆందోళన కలిగిస్తుంది. కేంద్రం ప్రత్యేక బృందాలను ఉత్తర ప్రదేశ్, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లకు నియమించి పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది . కేసుల పెరుగుదల మధ్య, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ అనే మూడు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలను విధించాయి . జూన్ నుండి నిలిపివేసిన లాక్ డౌన్ ఆంక్షలను మళ్ళీ కొనసాగించాలని భావిస్తున్నాయి . అయితే ఈ నిర్ణయం ఒక్కటే ప్రయోజనం కలిగించదని చెప్తున్నారు వైద్య నిపుణులు .

కరోనా వ్యాక్సిన్ రవాణాలో వారియర్ గా తపాలా శాఖ: మొదలైన రూట్ మ్యాపింగ్కరోనా వ్యాక్సిన్ రవాణాలో వారియర్ గా తపాలా శాఖ: మొదలైన రూట్ మ్యాపింగ్

 మూడు రాష్ట్రాలలో కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూలు

మూడు రాష్ట్రాలలో కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూలు

అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జైపూర్, జోధ్‌పూర్, కోటా, బికానెర్, ఉదయపూర్, అజ్మీర్, అల్వార్ మరియు భిల్వారా నగరాల్లో రాత్రి కర్ఫ్యూలను రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు విధించగా . రాజస్థాన్‌లో మార్కెట్లు, వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు రాత్రి 7 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మూడు పొరుగు రాష్ట్రాల్లోని ఈ నగరాలలో కేసులు దీపావళి ఉత్సవాలు ముగిసిన తరువాత పెరిగాయి.ఉదాహరణకు, జైపూర్‌లో రోజుకు 400 కన్నా తక్కువ కొత్త కేసుల నుండి 600 కి పైగా పెరిగాయి.

 లాక్ డౌన్ నిబంధనలు సడలించి ఆర్ధిక స్థితి గాడిలో పెట్టే పనిలో కేంద్రం

లాక్ డౌన్ నిబంధనలు సడలించి ఆర్ధిక స్థితి గాడిలో పెట్టే పనిలో కేంద్రం

మే చివరి నుండి, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కేంద్రం అన్‌లాక్ చర్యలను ప్రవేశపెట్టింది అంతే కాదు సరిహద్దుల్లో నిర్దిష్ట ఆంక్షలపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేసింది . రాష్ట్రాలలో కరోనా పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించింది . అయితే కరోనా కేసుల పరుగుదల నేపధ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలైన నైట్ కర్ఫ్యూల విషయానికొస్తే, అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో కానీ అంత మాత్రాన సామాజిక దూర నిబంధనలపై నిర్లక్ష్యం మంచిది కాదని అంటున్నారు నిపుణులు .

 దీపావళి సమయంలో భారీగా తగ్గిన టెస్టుల నిర్వహణ .. అందుకే ఈ పరిస్థితి

దీపావళి సమయంలో భారీగా తగ్గిన టెస్టుల నిర్వహణ .. అందుకే ఈ పరిస్థితి

సూరత్, వడోదర, జైపూర్ మరియు భోపాల్ లలో, దీపావళికి ముందు సమయంలో పరీక్షలు క్షీణించినట్లు అధికారిక సమాచారం. దీపావళికి దారితీసిన రోజుల్లో, 4,000-6,000 పరీక్షలు జరిగాయి, ఇవి నవంబర్ 15-17 నుండి 3,000 పరీక్షలకు తగ్గాయి. ఆదివారం నాటికి జైపూర్‌లో 8,537 పరీక్షలు జరిగాయి. సూరత్‌లో, దీపావళికి ముందు అధికారులు 11,000 పరీక్షలు చేశారు , ఇది పండుగ సందర్భంగా 8,000 పరీక్షలకు పడిపోయింది. ఇప్పుడు, పరీక్ష రోజుకు 11,000 - 12,000 పరిధిలో ఉంది. దీంతో దీపావళి పండుగ సమయంలో కరోనా పరీక్షలు కూడా తగ్గటం అప్పుడు కేసుల తగ్గుదలకు కారణం అని చెప్తున్నారు వైద్య నిపుణులు.

 అధిక టెస్టులు , కరోనా జాగ్రత్తలు లేకుంటే నైట్ కర్ఫ్యూలు వ్యర్ధమే : నిపుణుల అభిప్రాయం

అధిక టెస్టులు , కరోనా జాగ్రత్తలు లేకుంటే నైట్ కర్ఫ్యూలు వ్యర్ధమే : నిపుణుల అభిప్రాయం

కరోనా నిర్దారిత పరీక్షలు అధికంగా కొనసాగితే మరియు నివారణ చర్యల కోసం ప్రజలకు కలిగించాల్సిన అవగాహన సమాజంలో బలోపేతం అయితే ఈ పరిమితులు ప్రభావవంతంగా ఉంటాయని ఆ దిశగా ప్రయత్నం చెయ్యాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు . ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించటం , సామాజిక దూరాన్ని పాటించటం వంటి చర్యలతో పాటు కరోనా నిర్ధారిత పరీక్షలు కూడా అధికంగా జరిగేలా చూస్తేనే ప్రయోజనం ఉంటుందని, లేదంటే నైట్ కర్ఫ్యూలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు .

English summary
since the festive season ended, a trend of rising Covid-19 cases many states have once again imposed night curfews. Experts believe that night curfews are a waste if there are no more tests and corona precautions in this order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X