వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్నబ్ గోస్వామికే భద్రత ఎందుకు?: 9 ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, టైమ్స్‌నౌ ఛానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి పాకిస్థాన్ ఉగ్రవాద గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో భారత ప్రభుత్వం ఆయనకు 'వై' కేటగిరి భద్రతను సమకూర్చింది. దీంతో అర్నబ్‌కు 24 గంటల పాటు భద్రతా వలయం ఉండనుంది.

అర్నబ్ గోస్వామికి 'వై' కేటగిరి భద్రత

మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణ కల్పించనున్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు కూడా ఉన్నారు. కాగా, ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చిన కారణంగానే అర్నబ్ గోస్వామికి వై కేటగిరి భద్రతను కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, అర్నబ్‌కు ఇంత పెద్ద మొత్తంలో భద్రత కల్పించడం అవసరమా? అనే సందేహం పలువురికి కలుగుతోంది. అంతేగాక, దేశ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదీగాక, పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచే భద్రతా సిబ్బందికి కేంద్రప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నందున అర్నబ్ గోస్వామికి కల్పించిన భద్రతపై న్యూస్ హవర్‌లో చర్చ జరగాల్సి ఉందని అంటుంటున్నారు.

Nine questions about Arnab Goswami's 'Y' security cover that the nation should be asking

1. అర్నబ్ గోస్వామి ప్రాణాలకు ముప్పుందని భారత ఇంటెలిజెన్స్ అధికారులకు ఎలా తెలిసింది? ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చిన సందేశాలను గానీ, సమాచారాన్ని గానీ వారు మధ్యలో ట్రేస్ చేశారా?

2. టైమ్స్ నౌై ఎడిటర్ ఇన్ ఛీప్‌కు ఏయే సంస్థల నుంచి బెదరింపులు వచ్చాయి.

3. వై కేటగిరి భద్రతను ఎందుకు కేటాయించారు? జడ్, జడ్ ప్లస్ కేటగిరి ఎందుకు ఇవ్వలేదు.

4. అర్బన్ చేసిన ఏ వ్యాఖ్యలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని ఉగ్రవాద సంస్థలు భావించాయి? ఇవి తెలుసుకుంటే ఎలాంటి వ్యాఖ్యలు తక్కువ తీవ్రత గలవో జర్నలిస్టులకు అర్థమవుతుంది.

5. టైమ్స్ నౌ చానెల్‌లో ఒక్క అర్నబ్ గోస్వామి ప్రాణాలకే ముప్పు ఉందా? ఆయన సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదా? ఆయన్ని చంపేందుకు వచ్చే ఉగ్రవాదులు సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టరా?

6. టైమ్స్ నౌ ఛానెల్‌లో చర్చల కోసం వచ్చే అతిథులకు ఎలాంటి ముప్పు లేదా? వారందరూ క్షేమంగా ఉన్నట్లేనా?

7. అర్నబ్ గోస్వామికి రక్షణ కల్పించడం కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఎంత ఖర్చు పెడుతున్నారు?

8. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నందుకు ఆయన నుంచి రూ. 15లక్షలను వసూలు చేస్తున్నారు. మరి అర్నబ్ గోస్వామి నుంచి గానీ, ఆయనకు ఉద్యోగం ఇచ్చిన బెన్నెట్, కోల్‌మెన్ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి గానీ ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు?

9. వై కేటగిరి భద్రత సిబ్బందికి సరైన శిక్షణ ఉందో, లేదో పరీక్షించారా? వారు ధరించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నాణ్యమైనవేనా? వారికి పెల్లెట్ గన్స్ లాంటి నాన్ లెథల్ గన్స్ కూడా ఇస్తారా?

కాగా, వీఐపీల్లా భద్రత పొందిన జర్నలిస్టుల్లో అర్నబ్ గోస్వామి తొలి వ్యక్తేం కాదు. గతంలో చాలా మందికే ఇలాంటి భద్రతను కల్పించారు. గతంలో జీ న్యూస్ ఎడిటర్ ఇన్‌ చీఫ్ సుధీర్ చౌదరికి ఎక్స్ కేటగిరి, సమాచార్ ప్లస్‌కు చెందిన ఉమేష్ కుమార్ వై కేటగిరి, బిజెపి ఎంపీ, పంజాబ్ కేసరి పత్రిక యజమాని అశ్వినీ కుమార్ చోప్రాకు దేశంలోనే అత్యంత ఉన్నతమైన జడ్ ప్లస్ కేటగిరి భద్రతను అందించారు.

ఉగ్రవాదుల, ఇతరుల బెదిరింపుల కారణంగా కొందరికి మాత్రమే ఇలాంటి భద్రత కల్పించడం ఎంత వరకు సమంజసమని ఓ సెక్యూలర్ జర్నలిస్టు ప్రశ్నిస్తున్నారు. 2010 సంవత్సరం నుంచి దేశంలో 22మంది మంది జర్నలిస్టులు హత్యగావింపబడ్డారని, వారికి కూడా రక్షణ కల్పించి ఉంటే వారు కూడా బతికేవారు కాదా? అని నిలదీస్తున్నారు.

ప్రాణాలకు ముప్పు ఉందంటే దేశంలోని ఏ పౌరుడికైనా భద్రత కల్పించాలని రాజ్యాంగం పేర్కొందని, రాష్ట్రం ప్రభుత్వం ఈ అంశంలో బాధత్య తీసుకోవాల్సి ఉండగా, కేంద్రమే ఎందుకు భద్రత కల్పిస్తోందని ప్రశ్నించారు. మరికొందరు జర్నలిస్టులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందే చెప్పిన జగేంద్ర సింగ్ అనే జర్నలిస్టు కూడా భద్రత కల్పించి ఉంటే బతికే వాడని చెప్పారు. ఆయన గత జూన్‌లో హత్యగావింపబడ్డారని తెలిపారు.

English summary
It is a sign of the times we live in that the elevation of journalist Arnab Goswami to the status of a VIP with "Y" security has evoked more amusement than alarm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X