వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిపా వైరస్: చనిపోతూ భర్తకు నర్స్ లేఖ, కన్నీళ్ళు ఆగవు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Nipah Virus: Everything About The Virus That's Taking Lives In Kerala

తిరువనంతపురం: నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న ఓ నర్సు కూడ ఈ వ్యాధికి గురై మరణించింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది. మరణించే ముందు ఆమె తన భర్తకు రాసిన లేఖ చదివిన వారు కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు.

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కారణంగా 15 మందికి మృత్యువాత పడ్డారు. అయితే ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందిస్తున్న కోజికోడ్ కు చెందని లినీ అనే నర్సుకు కూడ వ్యాధి సోకింది.

Nipah-affected nurses letter from deathbed goes viral

నిపా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లినీకి కూడా ఆ వ్యాధి సోకింది. కొద్దిరోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మరణానికి కొద్ది గంటల ముందు భర్తకు లినీ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరి నుంచి మరొకరికి నిపా వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో కుటుంబసభ్యులకు కనీసం ఆఖరి చూపుకైనా లేకుండా లినీ భౌతికకాయానికి దహనసంస్కారాలు నిర్వహించారు.

నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నిన్ను కలుసుకునే సమయం లేదని కూడా తెలుసు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వాళ్లను గల్ఫ్‌కు తీసుకెళ్లు. నేనులేను అని మా నాన్నలానే జీవితాంతం ఒంటరిగా ఉండకు ఇవి నిపా వైరస్‌ సోకి మరణశయ్యపై ఉన్న నర్సు లినీ(31) తన భర్తకు లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లినీ మరణంపై స్పందించిన డాక్టర్‌ దీపూ సెబిన్‌ దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా, నిపా వైరస్‌ సోకి పలువురు కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు నర్సులు ఉన్నారు.

English summary
A letter written by a Keralite nurse minutes before she died of the 'Nipah' virus has gone viral in the social media, leaving people teary-eyed. Twenty eight-year-old Lini working in the Perambra Taluk Hospital in Kozhikode got exposed to the 'deadly' virus while treating affected patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X