వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నిఫా'తో మరొకరు మృతి: భయంతో గ్రామాలను వదులుతున్న ప్రజలు..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో నిఫా మృతుల సంఖ్య 14 కు చేరింది.
కోలికోడ్‌ జిల్లాకు చెందిన 22ఏళ్ల అబిన్‌కు నిఫా వైరస్‌ సోకడంతో ఆదివారం మృతి చెందాడు. అబిన్ నిఫా వ్యాధితో రెండు రోజుల క్రితం స్థానిక బేబీ మెమొరియల్‌ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.

Recommended Video

Nipah Virus: Everything About The Virus That's Taking Lives In Kerala

కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరో ఇద్దరు నిఫా వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరిని ఐసీయూలో ఉంచినట్టు తెలుస్తోంది. నిఫా కారణంగా ఇప్పటిదాకా చోటు చేసుకున్న 14మరణాల్లో 11కోజికోడ్ జిల్లాలోనే కావడం గమనార్హం. మిగతా మూడు మలప్పురం ప్రాంతంలో జరిగాయి.

nipah virus outbreak Death toll rises to 14 in Kerala, two more cases identified

కాగా, నిఫా సోకినవారు మొదట తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతారు. ఆపై కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. గబ్బిలాలు కొరికిన పండ్లను తినడం ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అయితే వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న కోజికోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని గబ్బిలాలపై పరీక్షలు జరపగా.. నిఫా నెగటివ్ అని తేలడం గమనార్హం. దీంతో వ్యాధి వ్యాప్తికి అసలైన కారణాలేంటో కనుగొనే పనిలో పడ్డారు డాక్టర్లు.

నిఫా కారణంగా కోజికోడ్ ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దూరం చేసేందుకు స్థానిక అధికారులు ఆదివారం ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కోజికోడ్ జిల్లాలోని చంగరోత్ గ్రామంలో ఇప్పటికే 40కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. మూసా కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇటీవల మరణించడంతో గ్రామస్తులు నిఫా అన్న భయంతో వణికిపోయారు. ఈ నేపథ్యంలోనే చాలామందిని ఊరిని వదిలిపెడుతుండటంతో అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు.

English summary
The Nipah virus claimed one more life in Kerala on Sunday, taking the death toll to 14 even as health authorities reiterated that the situation was under control and no fresh case was reported from affected areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X