వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌తో సీబీఐ అప్రోచ్: లండన్ నుంచి బ్రస్సెల్ పారిపోయిన నీరవ్ మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణంలో సుమారు రూ. 13వేల కోట్లు కాజేసిన ప్రధాన నిందితుడు నీరవ్‌ మోడీ లండన్‌లో ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అతడిని దేశానికి రప్పించేందుకు బ్రిటన్‌ అధికారులతో భారత్‌ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో నీరవ్ మోడీ లండ్ నుంచి బ్రసెల్స్‌ పారిపోయినట్లు తెలిసింది.

పీఎన్బీ స్కాం చాలా రోజుల ముందే భారత్‌ నుంచి పారిపోయిన నీరవ్‌ మోడీ ఆ తర్వాత అనేక దేశాలు తిరిగాడు. అయితే అతడు లండన్‌ చేరుకున్నాడని, యూకే ప్రభుత్వం నుంచి రాజకీయ ఆశ్రయం కోరేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై భారత అధికారులు యూకే ప్రభుత్వాన్ని సంప్రదించారు.

Nirav Modi flees from London, lands in Brussels

ఈ నేపథ్యంలోనే నీరవ్‌ లండన్‌ నుంచి బ్రసెల్స్‌కు పారిపోయినట్లు తాజాగా మీడియా వర్గాల తెలిసింది. సింగపూర్‌ పాస్‌పోర్ట్‌పై ప్రయాణిస్తున్న నీరవ్‌.. ప్రస్తుతం బ్రసెల్స్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం సింగపూర్ పాస్ పోర్టుపై తిరుగుతున్న నీరవ్ మోడీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కుదరదు.

ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏ దేశంలో ఉన్నాడో ఆచూకీ తెలియని పక్షంలో అంతర్జాతీయ సంస్థ ద్వారా డిఫ్యూసన్‌ నోటీసును జారీ చేసే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. దీంతో నీరవ్‌ ఆచూకీ కోసం ఇంటర్‌పోల్‌ ఛానల్‌ ద్వారా సీబీఐ బ్రిటన్‌ ప్రభుత్వానికి ఈ నోటీసులిచ్చింది.

English summary
A day after the Central Bureau of Investigation requested an Interpol notice, PNB fraud accused, Nirav Modi is said to have fled from London to Brussels. The media had flashed the news that Nirav Modi had landed in London and sought political asylum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X