వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో రాజకీయ ఆశ్రయం కోసం నీరవ్ మోడీ యత్నాలు

|
Google Oneindia TeluguNews

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్బీ) కుంభకోణంలో రూ. 13వేలకోట్లకుపైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆయన అక్కడే రాజకీయ ఆశ్రయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

భారత్‌, బ్రిటిష్‌ అధికారులను ఉటంకిస్తూ ఓ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు బ్రిటన్‌ హోంశాఖ అధికారులు నిరాకరించారు. వ్యక్తిగత కేసుల్లో సమాచారం పంచుకోలేమని స్పష్టం చేశారు. మరోవైపు మీడియాలో వచ్చిన వార్తలపై నీరవ్‌ మోడీ కూడా స్పందించలేదు.

 Nirav Modi flees to London, seeks political asylum

పీఎన్‌బీలో నీరవ్‌ మోడీ, అతని మామ మెహుల్‌ చోక్సీలు కలిసి రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. మోసం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయిన నీరవ్‌.. ప్రస్తుతం లండన్‌లో ఉంటూ అక్కడ పొలిటికల్‌ ప్రాసిక్యూషన్‌ పేరుతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కాగా, పీఎన్‌బీ కేసులో నీరవ్‌, చోక్సీలతో కలిపి 25 మందిపై మే నెలలో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇప్పటికే బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కూడా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.

English summary
Nirav Modi has fled to the United Kingdom and is said to be seeking political asylum. The Financial Times while quoting British and Indian officials said the PNB fraud accused is currently in the UK.
Read in English: Nirav Modi flees to London
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X