వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసు.. అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ పై నేడే విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు విచారించనుంది. అక్షయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే, జస్టిస్ ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

నిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖనిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖ

నిర్భయ కేసు నిందితుల్లో ఒకరు ఆత్మహత్య , ఒకరు మైనర్

నిర్భయ కేసు నిందితుల్లో ఒకరు ఆత్మహత్య , ఒకరు మైనర్

23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని నిర్భయను దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ మరియు రామ్ సింగ్ దోషులుగా నిర్ధారించారు. రామ్ సింగ్ జైలులో తనను తాను చంపుకోగా, నేరానికి పాల్పడిన మరో వ్యక్తి , మైనర్ అయిన కారణంగా బాల నేరస్తుల కేంద్రంలో మూడేళ్లపాటు ఉండి విడుదలయ్యాడు.

ముగ్గురికీ మరణ శిక్ష విధించిన హైకోర్టు.. సమర్ధించిన సుప్రీం

ముగ్గురికీ మరణ శిక్ష విధించిన హైకోర్టు.. సమర్ధించిన సుప్రీం

నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో హైకోర్టు వేసిన శిక్షలను సుప్రీంకోర్టు సమర్ధించింది. మరియు దోషులకు వేసిన మరణశిక్షలను ధృవీకరించింది. గత ఏడాది, పవన్ గుప్తా, వినయ్ శర్మ మరియు ముఖేష్ సింగ్ తమ నేరారోపణలను సమర్థించిన 2017 ఉత్తర్వులను పునః పరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం ధర్మాసనం నిరాకరించింది .

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన వినయ్ శర్మ.. సమీక్షించాలన్న అక్షయ్ కుమార్

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన వినయ్ శర్మ.. సమీక్షించాలన్న అక్షయ్ కుమార్

వారిలో ఒకరు - వినయ్ శర్మ - రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. ఇక అతని క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఇక వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని పేర్కొన్నాడు .ఇక ఈ కేసులో మరో నిందితుడు అక్షయ్ కుమార్ దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ ను మంగళవారం మధ్యాహ్నం, సుప్రీంకోర్టు విచారించనుంది .పిటిషన్లో, అక్షయ్ చాలా అసంబద్ధమైన వాదనలు చేసాడు .

రివ్యూ పిటీషన్లో అసంబద్ధమైన వాదనలు .. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ

రివ్యూ పిటీషన్లో అసంబద్ధమైన వాదనలు .. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ

ఇక అతని అభ్యర్ధనలో వేదాలు మరియు పురాణాలను ఉదహరించాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎలాగైనా ప్రజలను చంపుతున్నప్పుడు అతనికి మరణశిక్ష ఎందుకు అంటూ అసంబద్ధమైన వాదన చేస్తూ పిటీషన్ దాఖలు చేశాడు . అక్షయ్ అభ్యర్ధనను విచారించే ఇద్దరు న్యాయమూర్తులు గతంలో మిగతా ముగ్గురి రివ్యూ పిటీషన్లను తిరస్కరించారు. న్యాయమూర్తులు ఆర్ బానుమతి మరియు అశోక్ భూషణ్ మిగతా ముగ్గురు దోషుల సమీక్ష అభ్యర్ధనలను తిరస్కరించిన నేపధ్యంలో నేడు అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై విచారణ చెయ్యనున్నారు.

English summary
The Supreme Court will hear a review petition filed by one of the four men convicted in the 2012 Nirbhaya gang-rape and murder case at 2 pm Tuesday. A bench of Chief Justice of India SA Bobde and Justices R Banumathi and Ashok Bhushan will hear the plea filed by Akshay Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X