వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ నిందితుడి వ్యాఖ్య: కిరణ్ బేడీ స్పందన, కేసు ఫైల్ చేసిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో 2012 డిసెంబర్ నెలలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం ఘటన పైన.. నిందితుల్లో ఒకడైన ముఖేష్ స్టేట్‌మెంట్ పైన కిరణ్ బేడీ మంగళవారం స్పందించారు. ఇది నిందితుడి మైండ్ సెట్‌ను తెలియజేస్తోందన్నారు.

ఆమె ట్విట్టర్‌లో కూడా దీని పైన స్పందించారు. నేరాలను గుర్తించడం, విచారించడం కంటే ముందు.. అవి జరగకుండా చూడవలసి ఉందని అభిప్రాయపడ్డారు. నేరాలు ఎందుకు చేస్తున్నారనే మూలాలు తెలియకుండా మనం వాటిని ఎలా అడ్డుకోగలమని ప్రశ్నించారు.

కేసు ఫైల్ చేసిన పోలీసులు

అత్యాచారం జరగడానికి అబ్బాయికి కంటే అమ్మాయే ఎక్కువ కారణమని నిర్భయ రేప్‌ కేసు నిందితుడు ముఖేష్ సింగ్‌ ఆరోపణలతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంశాఖ రంగంలోకి దిగింది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీహార్ జైలు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు.

Nirbhaya case: Interview has exposed living reality of parochial mindset, says Kiran Bedi

తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. పోలీసులు సెక్షన్ 509, సెక్షన్ 504ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఢిల్లీ పోలీసు చీఫ్ బీఎస్ బస్సీ మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ వీడియోను ఏ టీవీ ఛానల్ కూడా ప్రసారం చేయకూడదని సూచించారు.

English summary
Reacting to a documentary on December 16, 2012 gang-rape, which has created a storm, former cop and BJP leader Kiran Bedi said on Tuesday that it has exposed a living reality of a parochial mindset.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X