వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసు: అడుగుదూరంలో దోషుల ఉరి శిక్ష, రాష్ట్రపతి వద్దకు ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్

|
Google Oneindia TeluguNews

నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ప్రక్రియ అమలు అడుగుదూరం మిగిలి ఉంది. 2012 డిసెంబర్ 16వ తేదీన ఆరుగురు మృగాళ్లు నిర్భయపై సామూహిక లైంగికదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా దోషులకు ఊరట కలుగకపోవడంతో.. చివరి అస్త్రంగా రాజ్యాంగ అధినేతను ఆశ్రయించారు.

ఎల్‌జీ టు రాష్ట్రపతి

ఎల్‌జీ టు రాష్ట్రపతి


దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ ఇదివరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా క్షమాభిక్ష అడిగారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్నారు. క్షమాభిక్షకు నో అని సర్కార్ చెప్పడంతో ఎల్‌జీ అంగీకరించలేదు. మెర్సీ ప్రసాదించబోనని కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. దీంతో ముఖేశ్ సింగ్ చివరి అవకాశం రాష్ట్రపతి భవన్ మెట్లు తట్టారు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నారు.

చివరి అవకాశం..

చివరి అవకాశం..

నిర్భయ కేసులో తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ముఖేశ్ సింగ్.. రాష్ట్రపతిని కోరారాని, ఈ మేరకు పిటిషన్ రాష్ట్రపతి వద్దకు పంపించామని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పిటిషన్‌పై రాష్ట్రపతి నిర్ణయం ఆధారంగా దోషులకు శిక్ష ఖరారు అవుతోంది. దోషుల ఉరిశిక్షకు సంబంధించి ఇప్పటికే తీహార్ జైలులో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22వ తేదీన ఉరిశిక్ష అమలు చేస్తామని చెప్పారు. కానీ దోషులు రాష్ట్రపతిని క్షమాభిక్ష అడగడంతో ఉరి శిక్ష విధించే తేదీ మారే అవకాశం ఉంది.

సామూహిక లైంగికదాడి..

సామూహిక లైంగికదాడి..

ఉరి శిక్ష గవర్నర్, రాష్ట్రపతిని క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నామని, ఉరిశిక్ష నిలుపుదల చేయాలని దోషులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దోషుల క్షమాభిక్ష పిటిషన్ తర్వాతే ఉరి శిక్ష అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఏడేళ్ల క్రితం ఢిల్లీ బస్సులో నిర్భయపై ముఖేశ్ కుమార్ సింగ్ సహా వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, రామ్ సింగ్, మైనర్ సామూహిక లైంగికదాడి చేసి.. తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే.

English summary
Ministry of Home Affairs has forwarded the mercy plea of Mukesh, one of the convicts in the 2012 Nirbhaya case, to the President
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X