వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసు : ఢిల్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన స్మృతీ,కేజ్రీవాల్ కౌంటర్..

|
Google Oneindia TeluguNews

నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదాపడటంపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఢిల్లీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2018లో దోషుల రివ్యూ పిటిషన్లను సుప్రీం కొట్టివేసిందని.. అప్పటి నుంచి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందా అని ప్రశ్నించారు. నిర్భయ తల్లి డిమాండ్ చేసేంతవరకు దోషులకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్మృతీ మాట్లాడారు.

నిర్భయ తల్లి కన్నీళ్లు కనిపించడం లేదా..

నిర్భయ తల్లి కన్నీళ్లు కనిపించడం లేదా..

తీహార్ జైళ్ల శాఖ ఢిల్లీ ప్రభుత్వం కిందకు వస్తుందని, 2018లో దోషుల రివ్యూ పిటిషన్లను కొట్టివేసినప్పుడే క్యురేటివ్,క్షమాభిక్ష కోసం వారిని దరఖాస్తు చేసుకోమని ఎందుకు నోటీసులు ఇవ్వలేదని స్మృతీ ప్రశ్నించారు. దోషుల్లో ఒకరైన మైనర్‌ బాలుడు విడుదలైనప్పుడు ప్రభుత్వం అతనికి రూ.10వేలతో పాటు కుట్టుమిషన్ల కిట్టు ఎందుకిచ్చిందని నిలదీశారు. నిర్భయ తల్లి కన్నీళ్లు మీకు కనిపించడం లేదా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని.. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని,దేశ పౌరులంతా ఇలాగే భావిస్తున్నారని చెప్పారు.

కేజ్రీవాల్ కౌంటర్

కేజ్రీవాల్ కౌంటర్

స్మృతీ ఇరానీ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి అంశాలను కూడా రాజకీయం చేయడం విచారకరం అని ట్వీట్ చేశారు. ఇలాంటి క్రూర మృగాలను ఆర్నెళ్లలో శిక్షించేలా చట్టాలను తీసుకురాలేమా? అని ప్రశ్నించారు. నిర్భయ ఉదంతాన్ని రాజకీయం చేయడం మానకుని.. దేశ మహిళలకు భద్రత కల్పించే నగరాన్ని రూపొందించేందుకు కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

కొత్త డెత్ వారెంట్

కొత్త డెత్ వారెంట్

నిర్భయ దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నందునా.. పటియాలా కోర్టు ప్రకారం దోషులను ఈ నెల 22న ఉరితీయం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. జైళ్ల నిబంధన ప్రకారం.. ఒకవేళ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైతే.. ఆరోజు నుంచి ఆరోజు నుంచి ఉరిశిక్ష అమలుకు 14 రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు దోషుల్లో ఏ ఒక్కరిని ఉరితీయడానికి కుదరదు. కాబట్టి నిర్భయ దోషులను పటియాలా కోర్టు చెప్పిన తేదీకి ఉరితీయలేమని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తాజాగా రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురికావడంతో ఫిబవ్రరి 1వ తేదీ ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని పటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.

English summary
Bharatiya Janata Party (BJP) leader and Union Minister Smriti Irani on January 17 blamed the Aam Aadmi Party (AAP) government for the delay in the hanging of the four Nirbhaya convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X