వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ హంతకుల చావు తెలివి....! రివ్యూ పిటిషన్‌లో వింతవాదనలు...!

|
Google Oneindia TeluguNews

ఓవైపు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డ వారిని ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుంటే...మరోవైపు నిర్భయ కేసులో ఉరిశిక్షపడ్డ నిందితులు మాత్రం వింతగా వ్యవహరిస్తున్నారు. ఏడు సంవత్సరాలుగా మహిళల హత్యాచారం కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న వారు తమకు బతికే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి అర్థం లేని వాదనలను కోర్టుకు వినిపించారు.

దిశ ఘటన తర్వాత మరోసారి వెలుగులోకి నిర్భయ ఘటన

దిశ ఘటన తర్వాత మరోసారి వెలుగులోకి నిర్భయ ఘటన

దిశపై అత్యాచారం, హత్య అనంతరం దేశంలోని పెద్ద ఎత్తున నిరసన జ్యాలలు మొదలయ్యాయి. మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలంటూ...ఆందోళనలను చెలరేగుతున్న నేపథ్యంలోనే దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఢిల్లీలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు నిందితుల ప్రస్తావన చర్చకు వచ్చింది. ఏడేళ్లు గడుస్తున్నా... వారికి ఉరిశిక్ష వేయకపోవడంపై పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో శిక్షను ఖారారు చేసేందుకు టైమ్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

 ఉరిశిక్ష రద్దుపై రివ్యూ పిటిషన్ వేసిన నిందితుడు

ఉరిశిక్ష రద్దుపై రివ్యూ పిటిషన్ వేసిన నిందితుడు

ఇలాంటీ సమయంలో నిర్భయ నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరైన అక్షయ్ సింగ్ ఠాకూర్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. తనకు విధించిన శిక్షపై పున: సమీక్ష చేయాలని కోరాడు. అయితే తన తరఫున వేసిన పిటిషన్‌లో మాత్రం ఓ వింత వాదన తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న, వాయు మరియు నీటీ కాలుష్యం వల్ల మానవుల జీవనప్రమాణకాలం తగ్గిపోతుందని, దీంతో ఢిల్లీ నగరం ఒక గ్యాస్ చాంబర్‌లా మారిందనే పేర్కొన్నాడు. అంటే సహజంగా తాను మరణించే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటీ సమయంలో ఉరిశిక్ష ఎందుకు అన్నట్టు అతితెలివి ప్రదర్శించాడు. దీంతో ఉరిశిక్ష నుండి తనకు మినహాయింపును ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కోన్నాడు.

2012లో నిర్భయ ఘటన

2012లో నిర్భయ ఘటన


కాగా 2012 డిసెంబర్‌ 16న జరిగిన నిర్భయ ఘటనలో మొత్తం ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో అతనికి 3సంవత్సరాల జైలు శిక్ష విధించగా... శిక్షను అనుభవించిన అనంతరం అనంతరం బయటకు వచ్చాడు.. మిగతా నిందితుల్లో రామ్‌సింగ్ అనే నిందితుడు జైల్లోనే 2013లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురికీ ఉరిశిక్ష విధించినా ఇంకా అమలు కాలేదు. దీంతో వారికి త్వరలో ఉరిశిక్ష విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అనంతరం వాటిని తిరస్కరించడం అనంతరం వినయ్ శర్మ తాను పిటిషన్ పెట్టుకోలేదని ప్రకటించాడు. వినయ్ శర్మ తర్వాతా అక్షయ్ సింగ్ ఠాకూర్ పిటిషన్ పెట్టుకోవడం గమనార్హం.

నిర్భయ నిందితులకు త్వరలో ఉరి

నిర్భయ నిందితులకు త్వరలో ఉరి

నిర్భయ నిందితులను త్వరలో ఉరితీసేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల్లో వారిని ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి ఉరితాళ్లను కూడ ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వారం రోజుల్లో వారు ఉరికంభం ఎక్కనున్నట్టు సమాచారం. మరోవైపు మహిళలు, చిన్న పిల్లలపై హత్యాచారాలకు పాల్పడినవారికి ఉరిశిక్షలు రద్దు చేయడంపై పార్లమెంట్ చట్టాలను పున: సమీక్షించాలని స్వయంగా రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, ఢిల్లీ ప్రభుత్వం కూడ నిందితులకు ఎలాంటీ క్షమాబిక్ష పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రాని తెలుపుతూ.. లేఖ పంపింది.

English summary
Akshay Kumar Singh, convicted in the Nirbaya case filed a review petition before the Supreme Court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X