వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసులో కేంద్రం కీలక నిర్ణయం... నిందితునికి క్షమాబిక్షను రద్దు చేస్తూ... రాష్ట్రపతికి లేఖ

|
Google Oneindia TeluguNews

నిర్భయ కేసులో క్షమాబిక్ష పెట్టుకున్న నేరస్థుడి అభ్యర్థనను తిరస్కరిస్తూ... కేంద్రం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, హత్యలపై స్పందించిన కాసేపేటికే ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది. పోక్సో చట్టంలో ఉరిశిక్ష పడ్డ నేరస్థులు క్షమాబిక్షకు అర్హులు కారని పేర్కోనడంతో పాటు క్షమాబిక్షలపై పున: సమీక్ష చేయాలని పార్లమెంట్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సూచించారు.

నిర్భయ దోషులకు త్వరలోనే 'ఉరి’: క్షమాభిక్ష తిరస్కరించిన 'ఢిల్లీ’, అదే బాటలో హోంశాఖ? నిర్భయ దోషులకు త్వరలోనే 'ఉరి’: క్షమాభిక్ష తిరస్కరించిన 'ఢిల్లీ’, అదే బాటలో హోంశాఖ?

Recommended Video

CP Sajjanar Press Meet || ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి || Oneindia Telugu
నిర్భయ కేసులో క్షమాబిక్ష కోరిన నిందితుడు

నిర్భయ కేసులో క్షమాబిక్ష కోరిన నిందితుడు


2012 సంవత్సరంలో ఢిల్లీలో 23 ఏళ్ల మహిళపై అయిదుగురు నిందితులను హత్యాచారం చేశారు.దీంతో ఇది నిర్భయ కేసుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అయిదుగురు నిందితుల్లో ఒకరు మైనర్ ఉండడంతో జూవైనల్ జైలుకు పంపి అనంతరం విడుదల చేశారు. మిగా నిందితులకు ఉరిశిక్ష పడింది. దీంతో నిందితుల్లో ఒకరైన రాంసింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన వారిలో వినయ్ శర్మ అనే నిందితుడు క్షమాబిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. దీంతో వినయ్ శర్మ పిటిషన్‌ను రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి పంపారు. ఈనేపథ్యంలోనే నిందితుని క్షమాబిక్ష పిటిషన్‌‌ను నిరాకరిస్తూ... కేంద్రం రాష్ట్రపతికి సిఫారసు చేసింది.

దిశ సంఘటనతో మరోసారి నిర్భయ కేసు ప్రస్తావన

దిశ సంఘటనతో మరోసారి నిర్భయ కేసు ప్రస్తావన


దిశ సంఘటన నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మహిళలు ,రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించారు. దిశ హత్యపై పార్లమెంట్‌లో కూడ చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యలంలోనే దేశ రాజధానిలో జరిగిన నిర్భయ సంఘటనతో దేశవ్యాప్త చర్చ జరిగింది. నిర్భయ సంఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా.. నిందితులకు ఉరిశిక్ష పడలేదనే వాదనలు వినిపించాయి. ఈనేపథ్యంలోనే వెంటనే వారిని ఉరి తీయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దిశ హత్య తర్వాత నిర్భయ కేసు మరోసారి చర్చకు దారి తీసింది.

నిర్భయ ఘటనపై ప్రధానిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

నిర్భయ ఘటనపై ప్రధానిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

మరోవైపు దిశ హత్య రాజకీయ దుమారం కూడ రేగింది. ప్రభుత్వ విధానాలపై పలు రాజకీయా పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో మంత్రి కేటీఆర్ నేరుగా స్పందించారు. ఇక్కడ జరిగిన సంఘటనపై ధ్వజమెత్తున్నారని, అయితే నిర్భయ కేసులో ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని, ఏడు సంవత్సరాలు అవుతున్నా నిర్భయ నిందితులకు ఇంకా ఉరిశిక్ష ఎందుకు పడలేదని కేటీఆర్ నేరుగా ప్రధానిని ప్రశ్నిస్తూ... ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రస్తుత పార్లమెంట్ లోనే చట్టాలు రూపోందించాలని ఆయన కోరారు. దిశ నిందితులకు కూడ కఠిన శిక్ష వెంటనే పడాలని ఆయన కోరారు.

English summary
The centre has recommended to President Ram Nath Kovind the rejection of a request for mercy by one of the convicts in the Nirbhaya case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X