వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ దోషుల శిక్షపై పాటియాలా కోర్టులో పిటిషన్, విచారణ, నిర్భయ పేరెంట్స్...

|
Google Oneindia TeluguNews

Recommended Video

#NirbhayaCase : నిర్భయ దోషుల శిక్షపై పాటియాలా కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ!!

నిర్భయ కేసు దోషుల శిక్షపై పాటియాల కోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ వేయడంతో కోర్టు.. క్షమాభిక్ష, రివ్యూ పిటిషన్ల వివరాలు తెలుసుకొనుంది. నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష విధించి 17 నెలలవుతున్నా శిక్ష అమలు కాకపోవడంతో నిర్భయ పేరెంట్స్ పాటియాల కోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టింది.

16న ఉరి..?

16న ఉరి..?

నిర్భయపై దోషులు లైంగికదాడి చేసిన డిసెంబర్ 16న ఉరిశిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులు కోరుతున్నారు. కేసు తీవత్ర దృష్ట్యా నలుగురు నిందితులను వీడియో కాన్పరెన్స్ ద్వారా కోర్టు విచారించనుంది. తీహర్ జైలు నుంచి ముఖేష్ సింగ్ అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ సింగ్, పవన్ గుప్తాను విచారిస్తోంది. నిర్భయ కేసులో నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించగా.. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే.

సుప్రీంలో పిటిషన్

సుప్రీంలో పిటిషన్

శిక్ష తగ్గించాలని ఇటీవల వినయ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. వెనక్కి తీసుకున్నారు. మరోవైపు అక్షయ్ కూమార్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణ ఈ నెల 17వ తేదీన చేపట్టనుంది. క్షమాభిక్షకు సుప్రీంకోర్టు నిరాకరిస్తే.. బంతి రాష్ట్రపతి వద్దకు చేరుతుంది. దోషులకు ఉరిశిక్ష విధించాలని రాష్ట్రపతి భావిస్తే.. రోజుల్లోనే ఉరి శిక్ష అమలవుతోంది. దోషులకు ఉరికి సంబంధించి తాడులను కూడా తయారుచేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకడు ఆత్మహత్య, మరొకడు మైనర్

ఒకడు ఆత్మహత్య, మరొకడు మైనర్

నిర్భయ కేసులో మొత్తం ఆరుగురు దోషులు. రామ్ సింగ్ అనే దోషి తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో మైనర్ బాలుడు, మూడేళ్ల శిక్ష తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ సింగ్, రామ్ సింగ్ ఉన్నారు. కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించింది. కానీ శిక్ష అమలుపై నిర్భయ పేరెంట్స్ పాటియాలా కోర్టును ఆశ్రయించారు.

వెంటనే శిక్షించండి..

వెంటనే శిక్షించండి..

నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని ఆమె పేరెంట్స్ కోరుతున్నారు. ఇవాళ జరిగే విచారణకు కూడా హాజరవుతున్నారు. మరోవైపు కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. దోషులను కోర్టు తీసుకొచ్చే పరిస్థితి లేనందున.. తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు.

English summary
The four convicts in the Nirbhaya rape case will be produced in the Patiala House Court on Friday. The convicts will be produced through video conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X