వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hang them one by one: చట్టం ఏమైనా ఆటబొమ్మనా, ఉరి వాయిదాకోసమే పిటిషన్లు: నిర్భయ తల్లి

|
Google Oneindia TeluguNews

నిర్భయ దోషులు చట్టంతో ఆటలాడుకుంటున్నారని తల్లి ఆశాదేవి ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా ఆట బొమ్మనా అని ఆమె ప్రశ్నించారు. ఒక్కో దోషి చట్టంతో గేమ్స్ ప్లే చేస్తున్నారని.. వారిని ఒక్కొక్కరిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఉరిశీక్ష వాయిదా వేసేందుకు ఒకరి తర్వాత ఒకరి ప్రయత్నిస్తునారని ఆమె ఆరోపించారు. అలా చేస్తేనే వారికి చట్టం అంటే ఏంటో అర్థమవుతోందన్నారు.

How dare you: ఇందిరాపై నిర్భయ పేరెంట్స్ ఫైర్, దోషులను క్షమించలేరా కామెంట్లపై ధ్వజంHow dare you: ఇందిరాపై నిర్భయ పేరెంట్స్ ఫైర్, దోషులను క్షమించలేరా కామెంట్లపై ధ్వజం

వాయిదా...

వాయిదా...

నిర్భయ దోషుల ఉరిశిక్ష ఈ నెల 22వ తేదీన అమలు చేయాల్సి ఉంది. అయితే ముఖేశ్ సింగ్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడంతో వాయిదాపడింది. క్షమాభిక్ష ఇచ్చేందుకు రాష్ట్రపతి నిరాకరించడంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలుకానుంది. ఈ క్రమంలో పవన్ కుమార్ గుప్తా తాను మైనర్‌ అని సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఇందులో కొత్త విషయం ఏమైనా ఉందా అని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పిటిషన్‌న తోసిపుచ్చింది.

బొమ్మలతో ఆటలా..?

బొమ్మలతో ఆటలా..?

నిర్భయ దోషులు ఉరి శిక్ష అమలు జాప్యం తల్లి ఆశాదేవి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దోషులు ఒక్కొక్కరు కోర్టు తలుపుతట్టడంతో.. ఉరిశిక్ష మరింత ఆలస్యమవుతోంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. దోషులకు చట్టం అంటే బొమ్మలతో ఆడుకున్నట్టు ఉందని, అందుకే ఒకరి తర్వాత ఒకరు కోర్టును ఆశ్రయిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు.

అప్పుడే మనశ్సాంతి

అప్పుడే మనశ్సాంతి


కానీ ఫిబ్రవరి 1వ తేదీన దోషులకు ఉరిశిక్ష అమలు చేసేవరకు తనకు మనశ్సాంతి లేదని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. ఇటీవల నిర్భయ దోషులను క్షమించొచ్చు కదా అని ప్రముఖ లాయర్ ఇందిరా జై సింగ్ చేసిన సూచన అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. ఇందిరా సూచనతో నిర్భయ తల్లిదండ్రులు ఒంటి కాలిపై లేచారు. ఇలాంటి వారి వల్లే దేశంలో లైంగికదాడులు జరుగుతున్నాయని కామెంట్ చేశారు. మహిళల బాధ అంటే ఏంటో తెలియదని విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.

English summary
asha Devi, mother of 2012 Delhi gang-rape victim, said on Monday that the convicts have been trying to delay their hanging one after another.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X