• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబైలో నిర్భయ తరహా ఘటన-మహిళపై అత్యాచారం-మర్మాంగాల్లో ఇనుపరాడుతో చిత్రహింసలు

|

మహారాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. 30 ఏళ్ల ఓ మహిళ అత్యాచారానికి గురైంది. అత్యాచార అనంతరం దుండగులు ఆమె మర్మాంగాల్లో ఇనుప రాడ్డును జొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది.

శుక్రవారం(సెప్టెంబర్ 10) తెల్లవారుజామున 3.30గంటలకు ఈ అత్యాచార ఘటనపై పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి... బాధితురాలు రక్తపు మడుగులో,అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆమెను ఘట్కోపర్‌లోని రాజవాది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 376,307ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు మరికొందరు ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అరెస్టయిన నిందితుడిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.

nirbhaya like incident mumbai woman raped and inserted rod in her private parts

'నిర్భయ' గుర్తుకు తెచ్చిన ఘటన :

ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన 9 ఏళ్ల క్రితం 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్ తన స్నేహితుడితో కలిసి రాత్రిపూట బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో.. బస్సు డ్రైవర్ రామ్‌సింగ్ సహా ఆరుగురు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె స్నేహితుడిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్లు జొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం ఆమెను,అతని స్నేహితుడిని కదులుతున్న బస్సు నుంచి బయటకు విసిరేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని మొదట ఢిల్లీ ఆస్పత్రిలో,ఆ తర్వాత సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది.

ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో... జువైనల్ హోమ్ నుంచి అతన్ని విడుదల చేశారు. మిగతా నలుగురు నిందితులను మార్చి 20,2020న తీహార్ జైల్లో ఉరితీశారు. నిర్భయ ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు నిందితులకు ఉరిశిక్ష పడింది. అంతకుముందు,నిందితులు పలుమార్లు రివ్యూ పిటిషన్లతో ఉరిశిక్షను వాయిదా పడేలా చేశారు. అందరూ ఒకేసారి కాకుండా... ఒక్కొక్కరు ఒక్కోసారి కోర్టును ఆశ్రయించడంతో ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. నిందితుల క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది.

nirbhaya like incident mumbai woman raped and inserted rod in her private parts

ఇటీవల సంచలనం సృష్టించిన మైసూరు గ్యాంగ్ రేప్ :

దేశవ్యాప్తంగా ఎక్కడో చోట నిత్యం మహిళలపై అత్యాచార ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీల కర్ణాటకలోని మైసూరులో ఓ ఎంబీఏ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఆ యువతిని ఐదుగురు వ్యక్తులు అడ్డగించి... నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 'ఆ రోజు క్లాస్‌లు అయిపోగానే రాత్రి 7.30 గంటలకు మేం బైక్‌పై బయటకు వెళ్లాం. జేఎస్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజీ రోడ్డు మీదుగా ఓ ప్రదేశానికి వెళ్లాం. ఆ స్పాట్‌ నాకు చాలా కాలంగా తెలుసు. అక్కడే బండి ఆపి సరదాగా నడక ప్రారంభించాం.

  Car plummets into sinkhole formed after excessive rain in Mumbai's Ghatkopar | Oneindia Telugu

  అకస్మాత్తుగా ఆరుగురు దుండగులు మమ్మల్ని రౌండప్ చేశారు. నాపై కర్రలతో దాడి చేశారు. నేను స్పృహ కోల్పోయేంతవరకూ అలా కొడుతూనే ఉన్నారు..నేను స్పృహలోకి రాగానే నా చుట్టూ నలుగురు గుమిగూడి ఉన్నారు. నా గర్ల్‌ఫ్రెండ్ ఏదని వారిని అడిగాను. అందులో ఇద్దరు వ్యక్తులు పొదల్లో నుంచి ఆమెను లాక్కొచ్చి నా పక్కన పడేశారు. ఆమె దేహం మొత్తం గాయాలతో ఉంది.' బాధితురాలి స్నేహితుడి తన వాంగ్మూలంలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

  English summary
  In a shocking incident,A 30-year-old woman was raped in Mumbai, after the rape, the assailants tortured her by inserting an iron rod into her private parts. The victim is currently in critical condition at a private hospital
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X