వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ చివరి కోరిక: మరణవాంగ్మూలంలో ఏం చెప్పింది?

నిర్భయ తన మరణవాంగ్మూలంలో తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. తనపై దాడి చేసినవారి సజీవంగా దహనం చేయాలని ఆమె కోరుకుంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై అసువులు బాసిన నిర్భయ ఏం మాత్రం చేతగాని స్థితిలోనూ మరణ వాంగ్మూలం ఇచ్చింది. తనపై అఘాత్యానికి పాల్పడినవారిని ఉరి తీయాలని, వారి సజీవంగా తగులబెడితే చూడాలని ఉందని ఆమె చెప్పింది.

ప్రాణాలు ఉంటాయో లేదో తెలియని స్థితిలో కూడా నిర్భయం ఓపికను కూడదీసుకుని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఆసుపత్రి బెడ్‌పై నుంచి ఆమె నాలుగు పేజీల డిక్లరేషన్ ఇచ్చింది. ఆమె మరణ వాంగ్మూలం, పోలీసుల సాక్ష్యాధారాలు ప్రధాన ఆధారాలుగా నలుగురు దోషులకు కింది కోర్టు ఇచ్చిన మరణశిక్షను సుప్రీంకోర్టు శుక్రవారం ఖరారు చేసింది

నిర్భయ చివరి క్షణాల్లో ఆమె మరణవాంగ్మూలాన్ని రికార్డు చేసిన సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఉషా చతుర్వేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. నిర్భయ చివరి క్షణాలో పడిన వేదన, ఆమె చివరి కోరకను గుర్తు చేసుకున్నారు.

వారిని సజీవంగా తగులబెట్టాలి..

వారిని సజీవంగా తగులబెట్టాలి..

తన జీవితాన్ని ధ్వంసం చేసిన రేపిస్టులు తగిన మూల్యం చెల్లించుకుని తీరాలని, వారిని కేవలం ఉరితీయడమే కాదు, సజీవంగా తగులబెట్టాలని నిర్భయ తన మరణవాంగ్మూలంలో చెప్పింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఆ బాధను పంటిబిగువుతో ఓర్చుకుని నిర్భయ వాంగ్మూలం ఇచ్చిందని, తన జీవితాన్ని నాశనం చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుందో ఆ శిక్ష అత్యున్నత న్యాయస్థానం తీర్పురూపంలో వెలువడిందని ఉషా చుతర్వేది చెప్పారు.

ఉషా చతుర్వేది ఇలా...

ఉషా చతుర్వేది ఇలా...

నిర్భయకు తొలి శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఎస్‌డీఎం ఉషా చతుర్వేది ఆమెను కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికతో నిర్భయ సమాధానమిచ్చింది. ఆమె మాటల్లో ఆగ్రహం, ఉక్రోషం, ఆవేదన కలగలసి ఉన్నట్టు తాను గ్రహించానని, కొద్దిసేపట్లోనే ఆమె నాలుగు పేజీల డిక్లరేషన్ ఇచ్చిందని తెలిపారు. ఇతర అమ్మాయిలకు తన వంటి పరిస్థితి ఎదురు కాకుండా తనపై అత్యాచారం జరిపిన మానవమృగాలకు ఉరితీసి వారిని మంటల్లో తగులబెట్టాలంటూ బలంగా కోరుకుందని ఆమె గుర్తు చేసుకున్నారు.

మరణ వాంగ్మూలం తోడ్పడింది...

మరణ వాంగ్మూలం తోడ్పడింది...

సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో నిర్భయ మరణవాంగ్మూలం ఈ కేసులో ఎంతగానో ఉపయోగపడిందని ఉషా చతుర్వేది చెప్పారు. అయితే నిందితుల తరఫు న్యాయవాది తన వాదనలో - చావుబతుకుల మధ్య ఉన్న నిర్భయ ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటూ నాలుగు పేజీల వాంగ్మూలం ఇవ్వడాన్ని ప్రశ్నించారు. అయితే ఆయన వాదను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

మెజిస్ట్రేట్‌

మెజిస్ట్రేట్‌

మరణించడానికి ఎనిమిది రోజుల ముందు డిసెంబర్ 21వ తేదీన నిర్భయ మెజిస్ట్రేట్‌కు మరణ వాంగ్మూలం ఇచ్చింది. బస్సులో ఆరేడుగురు ఉన్నారని, వారంతా ప్రయాణికులని అనుకున్నానని ఆమె తన మరణ వాంగ్మూలంలో చెప్పింది. కండక్టర్ బస్సు డోర్ లాక్ చేశాడని, దాంతో ఏదో జరుగుతుందని తనకు అనుమానం కలిగిందని ఆమె చెప్పింది.

లైట్స్ తీసేసి...

లైట్స్ తీసేసి...

బస్సు డోర్ లాక్ చేసిన తర్వాత కండక్టర్ లైట్లు ఆర్పేసి తన తిడుతూ తన మిత్రుడిపై దాడి చేశాడని, మిగతావాళ్ల తనను బస్సు వెనక్కి తీసుకుని వెళ్లారని, తన దుస్తులు చింపేశారని, తనపై అత్యాచారం జరిపారని, ఇనుపరాడుతో తనను ఇ్టం వచ్చినట్లు కొట్టారని నిర్భయ చెప్పింది.

స్పృహ తప్పాను....

స్పృహ తప్పాను....

తాను స్పృహ తప్పుతూ పోయానని, తనకు మెలుకువ రాగానే తనపై దాడి చేయడం ప్రారంభించారని నిర్భయ తన మరణ వాంగ్మూలంలో చెప్పింది. పట్టుకోండి, దుస్తులు చించేయండి, కొట్టండి, ఆమె బ్యాగ్ తీసుకోండి అనే మాటలు వినిపించాయని చెప్పింది. తాము మొత్తం అంధకారంలో ఉండిపోయామని, వాళ్లు నల్లగా కనిపించారని, వారి భాషను గమనిస్తే డ్రైవర్, క్లీనర్ల లాగా కనిపించారని, తన శరీరంలోకి రాడ్ జొప్పించారని ఆమె చెప్పింది.

English summary
"I want them hanged till death... I want to see them burnt alive," Nirbhaya had said in her dying statement, recorded in Safdarjung Hospital on December 21, 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X