• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శభాష్ సుభాష్: నిర్భయా హంతకులను నేను ఉరి తీస్తా, తమిళనాడు పోలీస్ సిద్దం, చాన్స్ ఇస్తారా !

|

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు పోలీసులు మరోసారి వార్తలో నిలిచారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయా హత్యాచారం హంతకులను ఉరి వెయ్యడానికి తమిళనాడు పోలీసు సిద్దం అయ్యారు. నిర్భయా హంతకులను ఉరి వెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నానని తమిళనాడు హెడ్ కానిస్టేబుల్ (పోలీసు) ఎస్. సుభాష్ శ్రీనివాసన్ పై అధికారులకు లేఖ రాశారు. తమిళనాడులోని శివగంగా జిల్లాలోని రామచంద్రాపురంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎస్. సుభాష్ శ్రీనివాసన్ (42) తాను నిర్భయా హంతకులకు చట్టపరంగా ఉరి వెయ్యడానికి తలారిగా మారుతానని, అందుకు తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వనవసరం లేదని అతని పై అధికారులకు స్పష్టం చేశారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

ఎవరీ సుభాష్ !

ఎవరీ సుభాష్ !

తమిళనాడు హెడ్ కానిస్టేబుల్ ఎస్. సుభాష్ శ్రీనివాసన్ వార్తల్లో నిలవడం ఇదే మొదటి సారికాదు. 2004 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అనాథ శవాలకు అంత్యక్రియలు చెయ్యడం, ఉచిత మంజినీటి సరఫరా చెయ్యడం, వివిద సామాజిక కార్యక్రమాల్లో నిత్యం భాగస్వామ్యం అవుతున్న సుభాష్ శ్రీనివాసన్ ఎప్పుడూ వార్తలో ఉంటారు. ఇప్పుడు సుభాష్ శ్రీనివాసన్ నిర్భయా హంతకులకు ఉరి వెయ్యడానికి తాలారిగా మారడానికి సిద్దం అయ్యాడు.

ఇంత దారుణం జరిగినా !

ఇంత దారుణం జరిగినా !

2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి ఢిల్లీలో 23 ఏళ్ల విద్యార్థిని (నిర్భయా), ఆమె స్నేహితుడిని బస్సులో కిడ్నాప్ చేసిన ఆరు మంది రాక్షసులు ఆమె మీద అత్యాచారం చేసి, ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచి రోడ్డు మీద విసిరేశారు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయా చివరికి ప్రాణాలు విడిచింది. ఆరు మంది దుర్మార్గుల్లో రామ్ సింగ్ అనే నిందితుడు 2013 మార్చిలో తీహార్ జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరె కామాందుడు మైనర్ కావడంతో మూడేళ్లు జైలు శిక్ష పడటంతో అతను విడుదలైనాడు. ఇక మిగిలిన వినయ్ శర్మ, పవన్, అక్షయ్, ముఖేశ్ లకు కోర్టులో ఉరి శిక్ష వేసినా తలారి లేడనే సాకుతో ఇంతవరకు అమలు చెయ్యలేదు.

 చేతులు ఎత్తేసిన తీహార్ జైలు సిబ్బంది

చేతులు ఎత్తేసిన తీహార్ జైలు సిబ్బంది

నిర్భయా దోషులకు శిక్ష పడినా ఉరిశిక్ష ఎందుకు అమలు చెయ్యడం లేదని పలు మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, అనేక మంది ప్రములు మండిపడుతున్నారు. నిర్భయా హంతకులను ఉరి తియ్యడానికి తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే మా దగ్గర తలారి లేడని తీహార్ జైలు సిబ్బంది చేతులు ఎత్తేశారు.

 దేశంలో శాశ్వత తలారి లేని దౌర్భాగ్యం

దేశంలో శాశ్వత తలారి లేని దౌర్భాగ్యం

దేశంలో చాల తక్కువ సందర్భాల్లో ఉరిశిక్షలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. గత 10 ఏళ్లలో కేవలం నలుగురికి మాత్రమే ఉరిశిక్ష అమలు చేశారు. ఇలాంటి సమయంలో శాశ్వత తలారిని ప్రభుత్వం నియమించలేదు. ఉరిశిక్ష అమలు అయ్యే సమయంలో మాత్రమే తలారి కోసం అధికారులు వెతుకుతున్నారు. దేశంలో ఇంత వరకు శాశ్వత తలారిని నియమించుకోలని దౌర్భాగ్యంలో మనం ఉన్నామంటే ఎంత సిగ్గుచేటు అని అనేక మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

 దిశ ఘటనతో ఉలిక్కిపడిన దేశం

దిశ ఘటనతో ఉలిక్కిపడిన దేశం

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన హైదరాబాద్ వెటర్నటీ డాక్టర్ దిశ హత్యాచారం నిందితుల ఎన్ కౌంటర్ తరువాత నిర్భయా ఘటన మరోసారి తెర మీదకు వచ్చింది. దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తరువాత మరోసారి నిర్భయా ఘటన విషయంలో తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. నిర్భయా దోషులకు ఎందుకు ఉరిశిక్ష అమలు చెయ్యడం లేదు అంటే తలారి చిక్కడం లేదు, ఇది అధికారుల నిర్లక్ష సమాధానం అంటూ పలు సంఘాలు మండిపడుతున్నాయి.

ఉరి వెయ్యడానికి నేను రెఢీ

ఉరి వెయ్యడానికి నేను రెఢీ

నిర్భయా దోషులను ఉరి వెయ్యడానికి తలారి చిక్కడం లేదనే వార్త ఇటీవల తమిళనాడు హెడ్ కానిస్టేబుల్ సుభాష్ శ్రీనివాసన్ మీడియాలో చూశాడు. నిర్భయా దోషులను చట్టపరంగా ఉరి తియ్యడానికి నేను సిద్దంగా ఉన్నానని, మీరు అవకాశం ఇస్తూ అనుమతి ఇవ్వాలని, తాను తాత్కాలిక తలారిగా మారినా మీరు ఇందుకోసం ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వనవసరం లేదని, మీరు నాకు అప్పగించే పని ఎంతో గొప్పదని హెడ్ కానిస్టేబుల్ సుభాష్ శ్రీనివాసన్ తమిళనాడు, ఢిల్లీ, తీహార్ జైలు పోలీసు అధికారులకు లేఖ రాశారు. అయితే తమిళనాడు పోలీసుల నుంచి కానీ, తీహార్ జైలు సిబ్బంది నుంచి కాని ఇంత వరకు సుభాష్ శ్రీనివాసన్ కు గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిసింది.

English summary
Chennai: S Subash Srinivasan, who is a head constable in the in-service training centre in Ramanathapuram. After reading about a lack of executioner in Tihar jail to hang the Nirbaya case convicts, S Subash Srinivasan volunteered to take up the role
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X