వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగనా రనౌత్‌కు థ్యాంక్స్ చెప్పిన నిర్భయ తల్లి: ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి ఆశాదేవి నుంచి మద్దతు లభించింది. అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరి తీయాలని కంగనా చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు.

కంగనా మాటల్లో తప్పులేదు..

కంగనా మాటల్లో తప్పులేదు..


అత్యాచార దోషులకు అనుకూలంగా మాట్లాడే మహిళలు రాక్షసులకు జన్మనిస్తారంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. న్యాయవాది ఇందిరా జైసింగ్‌ను ఉద్దేశిస్తూ కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఆశా దేవి అన్నారు.

కంగనా చేసిన వ్యాఖ్యలకు మద్దతు

కంగనా చేసిన వ్యాఖ్యలకు మద్దతు


‘కంగనా రనౌత్ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆమె సరిగ్గా చెప్పారు. ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలను ఖండించి నాకు అండగా నిలిచినందుకు కంగనాకు కృతజ్ఞతలు. కంగనా చెప్పినట్లుగా అత్యాచార దోషులను బహిరంగంగా ఉరితీయాలనే మాటలను నేను సమర్థిస్తాను' అని ఆశాదేవి వ్యాఖ్యానించారు.

మానవ హక్కుల సంఘాలపై నిర్భయ తల్లి ఆగ్రహం

మానవ హక్కుల సంఘాలపై నిర్భయ తల్లి ఆగ్రహం


తన కూతురు పట్ల జరిగిన దారుణం వల్ల పడిన బాధ ఏంటో తనకు మాత్రమే తెలుసనని ఆమె అన్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు ఈ మానవ హక్కుల కోసం పోరాడేవారు ఎటుపోయారు? అని ప్రశ్నించారు. ఇటువంటివాళ్లు మానవ హక్కుల పేరిట సమాజాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. యువతుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను వాళ్లు ఎగతాళి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మానవహక్కుల పేరిట వ్యాపారం చేస్తూ నేరస్తులకు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. నిర్భయ దోషులను క్షమించమనేందుకు ఆమె ఎవరు అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లే రాక్షసులకు జన్మనిస్తారని, ఇలాంటి వాళ్లకు రాక్షసులే జన్మిస్తారని మండిపడ్డారు.

ఆనాటి దారుణం...

ఆనాటి దారుణం...

కాగా, 2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై బస్సులో ఆరుగురు దుర్మార్గులు సామూహిక, అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. నిర్భయ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో రామ్ సింగ్ అనే దోషి తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరో మైనర్ దోషి జువైనల్ హోంలో శిక్ష అనుభవించి బయటికొచ్చాడు. మరో నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి ఇప్పటికే న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వీరి క్షమాభిక్ష కూడా తిరస్కరణకు గురైంది. ఈ దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయనున్నారు.

English summary
Nirbhaya's mother Asha Devi on Thursday thanked actress Kangana Ranaut for slamming Indira Jaising, the counsel of convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X