వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే టాప్ బెంగుళూరు ఐఐఎస్‌సీ: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్స్ ఎంపికైంది. దేశంలో అత్యంత గొప్ప కాలేజీగా ఢిల్లీలోని మిరండా హౌజ్ నిలిచింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌ను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం నాడు విడుదల చేశారు.

విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌, కళాశాలలు, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, మెడికల్‌, ఆర్కిటెక్చర్‌, లా కేటగిరీల కింద ఈ జాబితాను రూపొందించారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అత్యుత్తమ కాలేజీలు, విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారు.

బోధన, సదుపాయాలు, ప్రాక్టికల్స్, రీసెర్చ్, గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధులతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించినట్టు మంత్రి ప్రకటించారు.

NIRF India Rankings 2018: IISc Bangalore adjudged overall best, AIIMS Delhi tops medical institutes list

విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌, కళాశాలలు, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, మెడికల్‌, ఆర్కిటెక్చర్‌, లా కేటగిరీల కింద ఈ జాబితాను రూపొందించారు.

అత్యుత్తమ విశ్వవిద్యాలయం విభాగంలో బెంగళూరు ఐఐఎస్‌సీ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానంలో ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ బాంబే నిలిచాయి. ఉత్తమ వైద్య కళాశాలగా ఎయిమ్స్‌ నిలవగా.. ఎన్‌ఎస్‌ఎస్‌ఐయూ బెస్ట్‌ న్యాయకళాశాలగా ఎంపికైంది.

English summary
The Indian Institute of Science (IISC) in Bengaluru was adjudged the overall best institution in the country by the HRD Ministry's national ranking framework (NIRF).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X