వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతా ఇది విన్నారా?: నిర్మలా సీతారామన్ ‘మిలీనియల్స్ ’ కామెంట్స్‌పై పేలుతున్న సెటైర్లు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో మొబైల్ రంగం మందగమనంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆధునిక యువతి కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని.. ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని సీతారామన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఓలా, ఉబెర్‌లపైనే యువత మొగ్గు: ఆటో సంక్షోభంపై సీతారామన్ కీలక వ్యాఖ్యలుఓలా, ఉబెర్‌లపైనే యువత మొగ్గు: ఆటో సంక్షోభంపై సీతారామన్ కీలక వ్యాఖ్యలు

అంతేగాక, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లకే మొగ్గుచూపుతుండటం వల్లే ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవిగా, మరికొన్ని నవ్వు పుట్టించేవిగా ఉన్నాయి.

అందుకే నిరుద్యోగం పెరిగిపోయిందా?

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. అంతేగాక, డాలర్‌ను ప్రిఫర్ చేయడం వల్లే రూపాయి విలువ పడిపోతోందని వ్యాఖ్యానించాడు. నేరాలు కూడా పెరిగిపోతున్నాయి.. ఎందుకంటే నేరాలను భరించకుండా వాటిని అడ్డుకోవడం వల్లేనని చెప్పుకొచ్చాడు.

బైది లాజిక్..

టీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఎందుకంటే ప్రజలు కాఫీనే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి.

టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఎందుకంటే.. ప్రజలు రోమ్ న్యాకుడ్ ను ఇష్టపడుతున్నారు కాబట్టి..
తయారీరంగం కూడా ఇలాగే సంక్షోభాన్ని ఎదుర్కోంటోందని వ్యాఖ్యానించాడు మరో నెటిజన్.

వాట్సాప్ మెసేజ్ చూసేనా..

వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ చూసే ఆర్థిక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? నేను కూడా ఇలాంటి న్యూస్ చూశాను అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఇలా..

2017, 2018 సంవత్సరాలతో పోల్చుకుంటే 2019 సంవత్సరంలో ఓలా, ఉబెర్‌లో అంతగా వృద్ధిని నమోదు చేయలేదని, ఇది చూసి ఆర్థిక మంత్రి మాట్లాడితే బాగుంటుందని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చురకలంటించింది.

యువత ఇది విన్నారా?

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాన్ని యువత విన్నదా? వింటే మరి ఆ పనేది చేయండి. ఆటో రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించండి అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

నిర్మలకు మద్దతుగా కూడా

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో అనుభవం గల రాజకీయ నేత అని, ఆమెకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్ సేవలను వాడటం వల్లే ఆటో రంగం కొంత దెబ్బతిందనేది వాస్తవమని అన్నారు.

మోడీ జాకెట్లు అందుకే..

మోడీ జాకెట్ల గిరాకీ బాగా తగ్గిందని.. ఎందుకంటే యువత బట్టలు పంచుకోవడమే ఇందుకు కారణం అని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు.

English summary
We swear, sometimes it’s like the Universe wants to send maximum lols our way. Earlier today, India’s Finance Minister, Nirmala Sitharaman, made a statement about the connection between the automobile industry’s current condition and millennials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X